




Best Web Hosting Provider In India 2024

AP EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ – కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఈనెల 14వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఈనెల 21వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూుల్ విడుదలైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు…. ఈనెల 12 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 21వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. ఇక సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 24లోపు రిపోర్టింగ్ చేయాలి.
ఇందులో భాగంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగం పరీక్ష రాసిన ఇంటర్ బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లను కేటాయిస్తారు. మొత్తం 2 విడతల్లో సీట్ల భర్తీని పూర్తి చేస్తారు. ఇందులో బీ ఫార్మసీ, ఫార్మా డి, బీటెక్ బయోటెక్నాలజీ, పుడ్ టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కోర్సులున్నాయి. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
ముఖ్య తేదీలు:
- కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ -12/10/2025
- కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కు తుది గడువు – 12/10/2025
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం 3/10/2025
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు తుది గడువు – 14/10/2025
- వెబ్ ఆప్షన్లు ప్రారంభం -14/10/2025
- వెబ్ ఆప్షన్లకు తుది గడువు -17/10/2025
- వెబ్ ఆప్షన్ల మార్పు – 18/10/2025
- సీట్ల కేటాయింపు – 21/10/2025
- సెల్ఫ్ మరియు కాలేజీల్లో రిపోర్టింగ్ – 21/10/2025 నుంచి 24/10/2025
- తరగతులు ప్రారంభం – 21/10/2025
ఇక ఫైనల్ ఫేజ్ ప్రక్రియ ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఈనెల 29 వరకు అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలను https://eapcet-sche.aptonline.in/EAPCETAGR/ వెబ్ సైట్ లో చూడొచ్చు. రిజిస్ట్రేషన్ తో పాటు ప్రాసెస్ ఫీజు కూడా చెల్లించుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్
