ప్రైమ్ వీడియోలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్ హీరో.. మలయాళం నటి లీడ్ రోల్లో..

Best Web Hosting Provider In India 2024

ప్రైమ్ వీడియోలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్ హీరో.. మలయాళం నటి లీడ్ రోల్లో..

Hari Prasad S HT Telugu

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ను బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నిర్మిస్తుండటం విశేషం. ఈ అరుదైన కాంబినేషన్ గురించి ప్రైమ్ వీడియో శుక్రవారం (అక్టోబర్ 10) సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.

ప్రైమ్ వీడియోలోకి మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్ హీరో.. మలయాళం నటి లీడ్ రోల్లో..

ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఓటీటీలోకి నిర్మాతగా అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. ముంబై నేపథ్యంలో రూపొందే ‘స్టార్మ్’ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం హృతిక్.. ప్రైమ్ వీడియో తో కలిసి పనిచేస్తున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 10) అనౌన్స్ చేశాడు. ఇది హృతిక్ రోషన్, అతని బ్యానర్ అయిన హెచ్‌ఆర్ఎక్స్ ఫిల్మ్స్ మధ్య సహకారంతో నిర్మిస్తున్న వెబ్ సిరీస్.

వెబ్ సిరీస్ వివరాలు ఇవీ..

అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానున్న ఈ వెబ్ సిరీస్‌ను అజిత్‌పాల్ సింగ్ క్రియేట్ చేసి డైరెక్ట్ చేస్తున్నాడు. కథను అజిత్‌పాల్ సింగ్, ఫ్రాంకోయిస్ లూనెల్, స్వాతి దాస్ రాశారు. ప్రముఖ మలయాళ నటి పార్వతి తిరువోతుతోపాటు అలయ ఎఫ్, సృష్టి శ్రీవాస్తవ, రమా శర్మ, సబా ఆజాద్ ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘స్టార్మ్’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఇది ముంబై నేపథ్యంలో సాగే ఒక హై-స్టేక్స్ థ్రిల్లర్ డ్రామాగా చెబుతున్నారు.

హృతిక్ రోషన్ ఏమన్నాడంటే?

ఓటీటీలోకి నిర్మాతగా అడుగుపెడుతున్న హృతిక్ రోషన్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. “స్ట్రీమింగ్ రంగంలో నిర్మాతగా నా అరంగేట్రానికి ‘స్టార్మ్’ నాకు సరైన అవకాశాన్ని ఇచ్చింది. అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందించడంలో మంచి రికార్డు ఉన్న ప్రైమ్ వీడియోను ఎంచుకోవడం సహజంగా జరిగింది” అని అన్నాడు.

“అజిత్‌పాల్ క్రియేట్ చేసిన ఈ ఆకర్షణీయమైన ప్రపంచం నన్ను ‘స్టార్మ్‌’ వైపు ఆకర్షించింది. కథ చాలా వాస్తవంగా, శక్తివంతంగా ఉంది. ఇందులో అద్భుతమైన ప్రతిభావంతులైన నటీనటులు పోషించబోయే మరపురాని పాత్రలు ఉన్నాయి. ఈ సిరీస్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది” అని అతడు చెప్పాడు.

ప్రైమ్ వీడియో ఏం చెప్పిందంటే?

ప్రైమ్ వీడియో వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ ఈ వెబ్ సిరీస్ పై స్పందించారు. హృతిక్ రోషన్ తో కలిసి వెబ్ సిరీస్ తీసుకువస్తుండటం ఓ ముఖ్యమైన మైల్ స్టోన్ అని అన్నారు. స్టార్మ్ ప్రారంభం మాత్రమే అని, భవిష్యత్తులో ఇది మరిన్ని ఉత్తేజకరమైన ప్రాజెక్టులకు మార్గం సుగమం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ వెబ్ సిరీస్ త్వరలో నిర్మాణాన్ని ప్రారంభించనుంది. స్ట్రీమింగ్ తేదీ తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024