మంగళసూత్రం కనిపించకపోవడంతో ఏడ్చేసిన అవికా గోర్.. వీడియో వైరల్

Best Web Hosting Provider In India 2024

మంగళసూత్రం కనిపించకపోవడంతో ఏడ్చేసిన అవికా గోర్.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

అవికా గోర్ ఈ మధ్యే ఓ షోలో పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. అయితే అందులో తన మంగళసూత్రం కనిపించకపోవడంతో ఆమె ఏడుస్తున్న వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంగళసూత్రం కనిపించకపోవడంతో ఏడ్చేసిన అవికా గోర్.. వీడియో వైరల్ (Instagram Video Grab)

చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్ అవికా గోర్ ఏడ్చేసింది. మిలింద్ చాంద్వానీతో ఆమె పెళ్లి ఫంక్షన్లు ప్రస్తుతం కలర్స్ టీవీ షో ‘పతి పత్ని ఔర్ పంగా’లో జరుగుతున్నాయి. ఈ షో సెట్ నుంచి ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అవికా గోర్ ఏడుస్తూ కనిపించడం, మిలింద్ చాంద్వానీ ఆమెకు సర్దిచెప్పడం చూడొచ్చు. అసలు విషయం ఏంటంటే అవికాకు సంబంధించిన మంగళసూత్రం పోవడంతో ఆమె ఏడ్చేసింది. ఈ వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు ఆమెపై మండిపడుతున్నారు.

అవికా గోర్ ఎందుకు ఏడ్చింది?

అవికా గోర్, మిలింద్ చాంద్వానీల పెళ్లికి సంబంధించిన ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కావాల్సి ఉంది. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లి దుస్తుల్లో ఉన్న అవికా, తన పక్కనే కూర్చున్న మిలింద్‌తో కనిపిస్తుంది. మిలింద్ చేతిలో మంగళసూత్రం డబ్బా ఉన్నా, అందులో మంగళసూత్రం లేదు. అది పోయిందని తెలియగానే అవికా ఏడవడం మొదలుపెట్టింది.

ఈ వీడియోలో “యాక్టింగ్ చేయొద్దు” అని ఎవరో అంటున్న మాట వినిపిస్తుంది. అవికా ఏడుస్తుంటే మిలింద్ ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు. పక్క నుండి ఇంకొకరు.. “కృష్ణ! నువ్వు మంగళసూత్రం తీసుకుంటే ఇచ్చేయ్” అని అంటారు. మరొకరు అవికాని ఏడవద్దని చెబుతుంటారు.

ఆ సమయంలో మునావర్ ఫారూఖీ స్పందిస్తూ.. “ఒకవేళ సెట్‌లో ఎవరైనా సరదాకి జోక్ చేసి ఉంటే.. అవికా ఏడవడం చూసి వాళ్ళు వెంటనే మంగళసూత్రం తిరిగి ఇచ్చేసేవారు” అని అన్నాడు. ఆ తర్వాత, ఈ సమస్యను మీరే పరిష్కరించుకోండని మిలింద్, అవికాతో మునావర్ చెబుతాడు.

అవికాపై సోషల్ మీడియా ఫైర్

అవికా ఏడుస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దీనిని చూసిన కొందరు నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ.. “వీళ్ల పెళ్లి నాకు ఎందుకో అంతా ఫేక్‌గా అనిపిస్తుంది?” అని కామెంట్ చేశారు. మరొక యూజర్ స్పందిస్తూ.. “పెళ్లిని ఇంత ఆటపట్టించడం ఏంటి?” అని రాశారు. ఇంకొక యూజర్ కామెంట్ చేస్తూ.. “కేవలం కంటెంట్ కోసం ఇంత నాటకం ఆడుతారా?” అని ప్రశ్నించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024