




Best Web Hosting Provider In India 2024

ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ – పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
ఏపీ ఇంటర్ ఫీజు గడువును పొడిగించారు. పరీక్షల ఫీజు గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఓ ప్రకటన ద్వారా తెలిపింది. రూ.100 ఫైన్ తో ఈనెల 30 వరకు చెల్లించుకోవచ్చు.
ఏపీలో ఇంటర్ పరీక్షల ఫీజుపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 22వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని సూచించింది. ఇక రూ. 100 ఫైన్ తో అక్టోబర్ 30 వరకు ఫీజు కట్టుకునే అవకాశం కల్పించారు. ఈ తేదీల తర్వాత అవకాశం ఇవ్వమని బోర్డు స్పష్టం చేసింది. కాలేజీల ప్రిన్సిపల్స్ సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఫీజుల వివరాలు…
ఇక ఇంటర్ పరీక్షల ఫీజుల వివరాలు చూస్తే… జనరల్ లేదా వొకేషనన్ కోర్సుల థియరీ పరీక్షలకు రూ.600గా ఉంది. ప్రాక్టికల్స్‌కు జనరల్ కోర్సులు(సెకండ్ ఇయర్), వొకేషనల్(ఫస్ట్, సెకండ్ ఇయర్) విద్యార్థులకు రూ.275గా నిర్ణయించారు. జనరల్, వొకేషనల్ బ్రిడ్జి కోర్సులకు రూ.165 కాగా, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు ప్రాక్టికల్స్(సెకండ్ ఇయర్) రూ.275గా ఉంది.
ఫస్ట్, సెకండ్ ఇయర్ రెండూ కలిపి థియరీ పరీక్షలు ఉంటే రూ.1200గా నిర్ణయించారు. వొకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ రూ.550, జనరల్, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్సు సబ్జెక్ట్స్ రూ.330గా ఉంది. ఫస్ట్, ఇయర్ సెకండర్ ఇయర్ పాస్ అయి రీ అపియరింగ్ కోసం ఆర్ట్స్ రూ.1350, సైన్స్ రూ.1600గా ఫీజులు ఉన్నాయి.
పరీక్షల షెడ్యూల్…
మరోవైపు ఇటీవలనే ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ కూడా వచ్చేసింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానుండగా… ఫిబ్రవరి 24వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. మార్చి 24వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తి కానున్నాయి.
ఇక ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23వ తేదీన నిర్వహిస్తారు. సెకండియర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. 10వ తేదీతో ముగుస్తాయి. ఈ పరీక్షలు పూర్తి అయ్యాక… హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తారు.
సంబంధిత కథనం
టాపిక్
