గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు – 4 గ్రేడ్లుగా పునర్‌ వ్యవస్థీకరణ..! కొత్తగా వచ్చే మార్పులివే

Best Web Hosting Provider In India 2024

గ్రామ పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థ రద్దు – 4 గ్రేడ్లుగా పునర్‌ వ్యవస్థీకరణ..! కొత్తగా వచ్చే మార్పులివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

గ్రామ పంచాయతీ పరిపాలన వ్యవస్థలో కొత్త సంస్కరణలు రానున్నాయి. ఇందులో భాగంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. నాలుగు గ్రేడ్లుగా పంచాయతీల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారు. పంచాయతీరాజ్ లో ప్రత్యేకంగా ఐటీ విభాగం ఏర్పాటు కానుంది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

గ్రామ పంచాయతీల పరిపాలనా వ్యవస్థలో నూతన సంస్కరణలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్రవేసింది. గ్రామ పంచాయతీల్లో పారదర్శకతతో కూడిన పాలన అందించేందుకు సరికొత్త విధానాలకు రూపకల్పన చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసిన నిపుణులతో నాలుగు నెలలపాటు పలు దఫాల చర్చల అనంతరం.. పలు సంస్కరణలు తీసుకొచ్చేందుకు ముందడుగు వేశారు. ఈ విషయంలో సంబంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ చూపారు.

కొత్తగా వచ్చే మార్పులు…

10 వేలు జనాభా దాటిన పంచాయతీలను ఇకపై రూర్బన్ పంచాయతీలుగా గుర్తిస్తారు. పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను రూర్బన్ పంచాయతీలలో కల్పిస్తారు. వీటి పరిధిలో 359 పంచాయతీలు వస్తాయి. నూతన విధానంలో గతంలో ఉన్న క్లస్టర్ విధానం రద్దు చేసి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించనున్నారు. పంచాయతీ కార్యదర్శి పేరును పంచాయతీ అభివృద్ధి అధికారి (పి.డి.ఓ.)గా మార్పు చేశారు.

  • గ్రామ పంచాయతీల్లో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న క్లస్టర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది.
  • 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను ఇక మీదట స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పరిగణిస్తారు.
  • పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా పునర్ వర్గీకరించింది.
  • మరో మూడు గ్రేడ్లుగా గ్రామ పంచాయతీలను వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ 1 పంచాయతీల్లో పని చేస్తున్న 359 మంది కార్యదర్శుల వేతన శ్రేణి పెంపుతోపాటు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (డెప్యూటీ ఎం.పి.డి.ఓ.) కేడర్ కు వారికి పదోన్నతి కల్పిస్తారు. వీరిని 359 రూర్బన్ పంచాయతీల్లో నియమిస్తారు.
  • ప్రస్తుతం అమలులో ఉన్న ఐదు గ్రేడ్ల పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడ్లుగా సమీకరిస్తారు. వీరితోపాటు 359 మంది జూనియర్ అసిస్టెంట్/జూనియర్ అసిస్టెంట్-కమ్-బిల్ కలెక్టర్ల వేతన శ్రేణి పెంపుతోపాటు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తారు.
  • మెరుగైన పరిపాలన అందించేందుకు వీలుగా వీరిని రూర్బన్ గ్రేడ్ గ్రామ పంచాయతీల్లో నియమిస్తారు.
  • నూతన విధానంలో గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బంది కూర్పులోనూ మార్పులు చేశారు. మున్సిపాలిటీల్లో ఉన్న విధంగా ప్లానింగ్, పారుశుధ్యం, మంచి నీటి సరఫరా మరియు ఆఫీస్ సిబ్బంది విభాగాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా అవుట్‌ సోర్సింగ్/కాంట్రాక్ట్ సిబ్బంది జీతభత్యాలు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి ఇస్తారు.
  • అవసరాన్ని బట్టి ఇంజినీరింగ్, డిజిటల్ అసిస్టెంట్ల సేవలకు వీరిని వినియోగించుకునేందుకు ప్రభుత్వం అమోదం తెలిపింది. వీరిని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్లుగా కూడా ఉపయోగిస్తారు.
  • గ్రామ సచివాలయం బాధ్యతలతోపాటు భవనాలు, లే అవుట్ల నిబంధనలు వంటి సేవలనూ వీరు అందిస్తారు.
  • మినిస్టీరియల్ మరియు క్షేత్ర స్థాయి పోస్టుల మధ్య పరస్పర ప్రమోషన్లకు అవకాశం కల్పించారు. అందుకు సంబంధించిన సర్వీస్ రూల్స్ కి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • ఇంటర్ కేడర్ ప్రమోషన్ల కోసం సిబ్బందికి రెండు వారాలపాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఏడాదిపాటు ఆన్ జాబ్ శిక్షణ ఉంటుంది. వీరికి క్షేత్ర స్థాయి అనుభవం, ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి పరిపాలన అనుభవం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న వేతన శ్రేణిలోనే ఇంటర్ కేడర్ ప్రమోషన్లు అమలవుతాయి.
  • దీంతోపాటు డిప్యూటీ ఎంపీడీఓ పోస్టింగ్ లకు విధివిధానాలు రూపొందించింది. నేరుగా డిప్యూటీ ఎంపీడీఓలుగా నియమితులైన వారు కనీసం మూడు సంవత్సరాల పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసి స్పెషల్ గ్రేడ్ పంచాయతీల్లో పంచాయతీ అభివృద్ధి అధికారులుగా పని చేయాలి.
  • సంస్కరణల్లో భాగంగా పంచాయతీ రాజ్ శాఖలో ప్రత్యేక ఐటీ విభాగం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో అర్హులైన డిజిటల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకుంటూ గ్రామ పంచాయతీల్లో రికార్డులు, ఆన్ లైన్ ద్వారా పరిపాలనను పర్యవేక్షిస్తారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Pawan KalyanAp CabinetAndhra Pradesh NewsChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024