ఏపీ – తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో నాలుగైదు రోజులు వర్షాలు – ఈ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు

Best Web Hosting Provider In India 2024

ఏపీ – తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో నాలుగైదు రోజులు వర్షాలు – ఈ జిల్లాలకు ‘ఎల్లో’ హెచ్చరికలు

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాల పడనున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉండగా… మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని ఐఎండీ తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Arvind Yadav/Hindustan Times)

ఏపీ, తెలంగాణకు వాతవరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. మరికొన్ని రోజులు పాటు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

ఏపీ వెదర్ రిపోర్ట్:

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో వర్షాలు పడనున్నాయి. ఆదివారం(12-10-25) అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మాత్తుగా ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..

ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్ వాతవరణ కేంద్రం వివరాల ప్రకారం… ఇవాళ కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు.

ఇక రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

అక్టోబర్ 14వ తేదీన ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈజిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

WeatherImdImd AlertsAp Rains
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024