ముద్దు పెట్టుకుంటూ కనిపించిన మాజీ ప్రధాని- ప్రముఖ సింగర్​! ఫొటోలు వైరల్​..

Best Web Hosting Provider In India 2024


ముద్దు పెట్టుకుంటూ కనిపించిన మాజీ ప్రధాని- ప్రముఖ సింగర్​! ఫొటోలు వైరల్​..

Sharath Chitturi HT Telugu

కెనడా మాజీ ప్రధాని జస్టిన్​ ట్రూడో, ప్రముఖ సింగర్​ కేటీ పెర్రీ సంబంధంపై వస్తున్న ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ కొన్ని ఫొటోలు ఆన్​లైన్​లో దర్శనమిచ్చాయి. ఆ ఫొటోల్లో వారిద్దరు కౌగిలించుకుంటూ, మద్దు పెట్టుకుంటూ కనిపించారు.

జస్టిన్​ ట్రూడో- కేటీ పెర్రీ (X@jacksonhinklle, X/@katyperry)

కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో, ప్రముఖ గాయని కేటీ పెర్రీ ప్రేమ వ్యవహారం మరోసారి వార్తల్లో నిలిచింది! కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా తీరంలో వీరిద్దరూ ఒక యచ్ట్​లో అత్యంత సన్నిహితంగా గడిపిన దృశ్యాలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

ది డైలీ మెయిల్ పత్రికకు అందిన ఫోటోల్లో.. 40ఏళ్ల కేటీ పెర్రీ, 53 ఏళ్ల ట్రూడోను దగ్గరగా కౌగిలించుకుని కనిపించారు. ఈ ఫొటోల్లో కేటీ పెర్రీ నలుపు రంగు వన్-పీస్ స్విమ్‌సూట్ ధరించగా, ట్రూడో చొక్కా లేకుండా జీన్స్ ధరించి ఉన్నారు.

ఓ ఫోటోలో.. ఈ జంట ఒకరినొకరు కౌగిలించుకున్నట్లు కనిపిస్తే, మరొక చిత్రంలో ట్రూడో కేటీ పెర్రీ చెంపకు ముద్దు పెడుతూ ఉంది. ఇంకో ఫోటోలో ట్రూడో, గాయని కేటీ పెర్రీ వెనుక భాగాన్ని ఆనుకుని ఉన్నట్లుగా ఉంది. ఈ చిత్రాలు సెప్టెంబర్‌లో శాంటా బార్బరా తీరంలో తీసినట్లు సమాచారం.

ఈ దృశ్యాన్ని చూసిన ఒక సాక్షి.. ది డైలీ మెయిల్‌తో మాట్లాడుతూ, “ఒక చిన్న పబ్లిక్ వేల్-వాచింగ్ బోట్‌ పక్కన ఆమె బోట్‌ను ఆపింది. ఆ తర్వాత వారు ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి చేతిపై ఉన్న టాటూను చూసేవరకు ఆయనెవరో నాకు తెలియదు. ఆ టాటూ చూసిన తర్వాతే, ఆయన జస్టిన్ ట్రూడో అని వెంటనే అర్థమైంది,” అని వివరించారు.

కేటీ పెర్రీ – జస్టిన్ ట్రూడో ‘రిలేషన్​’..

ఇద్దరి సంబంధాన్ని ఇటు ట్రూడో గానీ, అటు కేటీ పెర్రీ గానీ అధికారికంగా ధృవీకరించకపోయినా, తాజాగా డైలీ మెయిల్ ప్రచురించిన ఈ ఫోటోలు వారి గురించి చాలా కాలంగా నడుస్తున్న ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి!

కేటీ పెర్రీ గతంలో నటుడు ఓర్లాండో బ్లూమ్ నుంచి విడిపోగా, జస్టిన్ ట్రూడో తన భార్య సోఫీ గ్రెగొయిర్​తో వైవాహిక బంధాన్ని ముగించుకున్నారు.

కెనడా మాజీ ప్రధాని ట్రూడో, కేటీ పెర్రీల మధ్య తొలిసారిగా ఈ ఏడాది జులైలో మాంట్రియల్లో జరిగిన ఒక వ్యక్తిగత విందులో కనిపించడంతో ప్రేమ పుకార్లు మొదలయ్యాయి.

ఆ తర్వాత, వారిద్దరూ మౌంట్ రాయల్ పార్క్​లో కలిసి నడుస్తూ కనిపించారు.

కెనడాలో జరిగిన కేటీ పెర్రీ ‘లైఫ్‌టైమ్స్’ టూర్​లో కూడా ట్రూడో కనిపించారు.

అయితే ఆగస్టు నాటికి వారి మధ్య అనుబంధం బలహీనపడిందని కొన్ని నివేదికలు వచ్చాయి.

“ఆమె బిజీ, అతను బిజీ. వారికి చాలా పనులు ఉన్నాయి. కొత్తదనం తగ్గిపోయింది. కానీ వారి మధ్య ఎలాంటి ప్రతికూలత లేదు. వారు ఇకపై నిరంతరం సంభాషణలో ఉండటం లేదు. ఇది మారవచ్చు, కానీ ప్రస్తుతానికి ఇంతే,” అని ఒక సోర్స్​ డైలీ మెయిల్‌కు తెలిపినట్టు సమాచారం.

ఆపై సెప్టెంబర్‌లో.. కేటీ, జస్టిన్ “ఇంకా మాట్లాడుకుంటున్నారు, ఒకరిపై మరొకరు చాలా ఆసక్తిగా ఉన్నారు,” అని, అయితే వారు ఈ విషయాలను “ప్రైవేట్‌గా” ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని మరొక సోర్స్​ యూఎస్​ వీక్లీకి తెలిపింది.

ఈ నెలలోనే, డైలీ మెయిల్ ఒక సోర్స్​ని ఉటంకిస్తూ, ట్రూడో, పెర్రీల మధ్య రొమాన్స్ బలంగా ఉందని నివేదించింది. “కేటీ ఆయనపై చాలా, చాలా ఆసక్తిగా ఉంది. అతను నిజమైన ‘క్యాచ్’, చాలా ఉన్నతమైన వ్యక్తి అని ఆమె చెబుతోంది. ఆమె చాలా వివరాలను తనలోనే ఉంచుకున్నా, అతనంటే ఆమెకు చాలా ఇష్టం అని స్పష్టంగా తెలుస్తోంది,” అని ఆ మూలం ‘ది మెయిల్’తో చెప్పింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link