ఇంకా థియేటర్లలోకి రాని తమిళ స్పోర్ట్స్ డ్రామా..ఓటీటీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్స్.. విక్రమ్ కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఇక్కడే!

Best Web Hosting Provider In India 2024

ఇంకా థియేటర్లలోకి రాని తమిళ స్పోర్ట్స్ డ్రామా..ఓటీటీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్స్.. విక్రమ్ కొడుకు మూవీ స్ట్రీమింగ్ ఇక్కడే!

ఓటీటీలోకి తమిళ స్పోర్ట్స్ డ్రామా దూసుకు రానుంది. ఇంకా థియేటర్లలో రిలీజ్ కానీ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్స్ అయింది. ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందో చూసేయండి.

ఓటీటీలోకి తమిళ స్పోర్ట్స్ డ్రామా (x)

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా తన సొంత కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. ధ్రువ్ విక్రమ్ హీరోగా స్పోర్ట్స్ థ్రిల్లర్ ‘బైసన్’ మూవీ రాబోతుంది. ఈ సినిమా ఇంకా థియేటర్లో రిలీజ్ కాలేదు. కానీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయింది. ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు రాబోతుంది? ఓటీటీ రిలీజ్ డేట్ ఏంటో ఓ సారి చూసేయండి.

బైసన్ ఓటీటీ

ధ్రువ్ విక్రమ్ హీరోగా నటించిన బైసన్ మూవీ త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది. అక్టోబర్ 17న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మరోవైపు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఓటీటీలోకి ఎప్పుడు?

బైసన్ మూవీ దీపావళి సందర్భంగా పండుగకు ముందుగానే అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందో చూసేయండి. సాధారణంగా సౌత్ ఇండియా సినిమాలు నాలుగు వారాల థియేటర్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తున్నాయి. బైసన్ మూవీ కూడా ఇదే బాటలో వెళ్లనుంది. ఈ సినిమా నవంబర్ లో ఓటీటీలోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కబడ్డీ ప్లేయర్

బైసన్ స్పోర్ట్స్ డ్రామాలో ధ్రువ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం అతను ఎంతో కష్టపడ్డాడు. ఫిజికల్ గా తన బాడీని మార్చుకున్నాడు. ఈ సినిమా కోసం కబడ్డీ ప్లేయర్ మనాతి గణేషన్ దగ్గర ధ్రువ్ విక్రమ్ ట్రైనింగ్ తీసుకున్నాడు.

బైసన్ సినిమాలో ధ్రువ్ విక్రమ్ తో అనుపమ పరమేశ్వరన్ రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాలో పసుపతి, అమీర్ లాల్,రజిష విజయన్, అరువి మాధన్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీకి మారి సెల్వరాజ్ డైరెక్టర్.

తండ్రితో కలిసి

తండ్రి విక్రమ్ బాటలో సాగుతూ హీరోగా తన కెరీర్ నిర్మించుకుంటున్నాడు ధ్రువ్ విక్రమ్. 2019లో వచ్చిన ఆదిత్య వర్మతో ధ్రువ్ డెబ్యూ చేశాడు. తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాకు ఇది తమిళ రీమేక్. ఆ తర్వాత వర్మ సినిమాలో నటించాడు. అనంతరం తండ్రి విక్రమ్ తో కలిసి మహాన్ మూవీలో చేశాడు ధ్రువ్.

ఇప్పుడు బైసన్ మూవీతో థియేటర్లలో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాడు ధ్రువ్ విక్రమ్. ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలని కష్టపడ్డాడు ధ్రువ్. మరి బైసన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024