బిగ్ బాస్ 9 తెలుగు..వైల్డ్ కార్డ్స్ లో బిగ్ ట్విస్ట్.. ఆ స్టార్లు రాలేదు..హౌస్ లోకి ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు..ఎవరంటే?

Best Web Hosting Provider In India 2024

బిగ్ బాస్ 9 తెలుగు..వైల్డ్ కార్డ్స్ లో బిగ్ ట్విస్ట్.. ఆ స్టార్లు రాలేదు..హౌస్ లోకి ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు..ఎవరంటే?

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లోకి ఫైర్ స్టార్మ్ వచ్చేసింది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ పోరును మరో లెవల్ కు తీసుకెళ్లడానికి గ్లామర్, కాంట్రవర్సీ, ఫైట్.. ఇలా డిఫరెంట్ కేటగిరీల సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించారు.

బిగ్ బాస్ 9 తెలుగు వైల్డ్ కార్డ్స్ (instagram)

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ మరింత రసవత్తరంగా మారింది. ఇది రణరంగమే అంటు చెప్తున్న బిగ్ బాస్ ఇవాళ వైల్డ్ కార్డు ఎంట్రీలతో నిజంగానే హౌస్ ను యుద్ధ భూమిగా మార్చాడు. బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లోకి ఏడుగురు వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లు ఎవరో చూసేయండి.

రమ్య మోక్ష

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఆదివారం (అక్టోబర్ 12) ఫస్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌస్ లోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా పాపులారిటీ, పికిల్స్ బిజినెస్, నాన్న చనిపోవడం, ట్రోల్స్ ఇలా తన బ్యాక్ గ్రౌండ్ ఏవీ ప్రదర్శించారు. లగ్జరీ ఫుడ్ పవర్ ను వాడి ఎప్పుడైనా ఇష్టమైనా ఫుడ్ తినొచ్చని రమ్యకు పవర్ స్టోన్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. రమ్య రాగానే రచ్చ లేపుతుంది. ఓవరాక్టింగ్ శ్రీజ, సెల్ఫిష్ డీమన్, సేఫ్ గేమ్ భరణి, మ్యానిపులేటర్ రాము, ఫేక్ దివ్య నిఖిత ఇలా పికిల్స్ ను ఇచ్చేస్తుంది రమ్య.

శ్రీనివాస్ సాయి

రెండో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన శ్రీనివాస్ సాయి ఎంట్రీ ఇచ్చాడు. లక్ష భక్షములు అనే టంగ్ ట్విస్టర్ ను సంజనతో చెప్పించాలని నాగార్జున టాస్క్ ఇచ్చాడు. ఇమ్యునిటీ పవర్ గా బ్లూ స్టోన్ ను ఇచ్చి పంపించాడు. గోల్కోండ హై స్కూల్, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో నటించాడు సాయి. హీరోగా వినరా సోదర వీర కుమార సినిమా చేశాడు. ఇందులో ప్రియాంక జైన్ హీరోయిన్.

దువ్వాడ మాధురి

దువ్వాడ (దివ్వెల) మాధురి.. అటు సోషల్ మీడియాలోనూ, మొయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పాపులర్ అయిన పేరు ఇది. టెక్కలి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో సంబంధం కారణంగా మాధురి పేరు మార్మోగిపోయింది. అయితే అంతకంటే ముందే సోషల్ మీడియాలో రీల్స్ తో కూడా ఫేమస్ అయింది మాధురి. ఏవీలో మాధురి, శ్రీనివాస్ డ్యాన్స్ వైరల్ గా మారింది. మాధురికి ముగ్గురు ఆడ పిల్లలు కాగా, శ్రీనివాస్ కు ఇద్దరు పిల్లలు.

నిఖిల్ నాయర్

పలుకే బంగారమాయనే, గృహ‌ల‌క్ష్మి సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన నటుడు నిఖిల్ నాయర్. సీరియల్ యాక్టింగ్ తో అతను చాలా మంది ఫ్యాన్స్ నే సంపాదించుకున్నాడు. వైల్డ్ కార్డు ద్వారా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లాడు నిఖిల్. కొత్త కెప్టెన్ గా బ్యాడ్జ్ తో ఎంట్రీ ఇస్తాడు.

అయేషా జీనథ్

క్యూట్ అయేషా జీనథ్ కూడా వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. మాటీవీ సీరియల్ సావిత్రి గారి అబ్బాయితో ఫేమస్ అయింది అయేషా. కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2లోనూ మెరిసింది. తమిళ్ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసింది.

గౌరవ్ గుప్తా

మాటీవీలో వచ్చే గీత ఎల్ఎల్బీ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు గౌరవ్ గుప్తా. ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ బిగ్ బాస్ 9 తెలుగు హౌస్ లోకి వైల్డ్ కార్డుగా ఎంటరయ్యాడు.

మరోవైపు సీరియల్ హీరోయిన్లు సుహాసిని, కావ్య శ్రీ వైల్డ్ కార్డు ఎంట్రీతో వస్తారని అంతా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ లాస్ట్ లో అదిరే ట్విస్ట్ ఇచ్చాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024