గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి ఛాలెంజ్.. సై అన్న మీనా.. వచ్చిన ఒక్క స్టూడెంట్‌నీ వెళ్లగొట్టిన కామాక్షి

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి ఛాలెంజ్.. సై అన్న మీనా.. వచ్చిన ఒక్క స్టూడెంట్‌నీ వెళ్లగొట్టిన కామాక్షి

Hari Prasad S HT Telugu

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (అక్టోబర్ 13) ఎపిసోడ్ లో ప్రభావతి భరతనాట్యం డ్యాన్స్ స్కూల్ ప్రారంభమవుతుంది. అయితే ఒక్క స్టూడెంట్ కూడా రాకపోవడంతో ఆమె ఢీలాపడిపోతుంది. చివరికి మీనానే ఆమెకు తొలి శిష్యురాలిగా మారుతుంది.

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: ప్రభావతి ఛాలెంజ్.. సై అన్న మీనా.. వచ్చిన ఒక్క స్టూడెంట్‌నీ వెళ్లగొట్టిన కామాక్షి

గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 530వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ను ముగ్గురు కోడళ్లు కలిసి మొదలుపెట్టడం దగ్గరి నుంచి ఒక్క స్టూడెంట్ కూడా రాక ప్రభావతి ఈగలు తోలడం వరకు కాస్త సరదాగా సాగిపోయింది. చివరికి అత్తపై మీనా జాలి చూపించి తొలి విద్యార్థిగా ఆమెనే వచ్చి చేరుతుంది.

ముగ్గురు కోడళ్ల రిబ్బన్ కటింగ్.. ప్రభావతి డ్యాన్స్

గుండె నిండా గుడి గంటలు సోమవారం (అక్టోబర్ 13) ఎపిసోడ్ మొత్తం ప్రభావతి డ్యాన్స్ స్కూల్ చుట్టే తిరిగింది. ఎపిసోడ్ మొదట్లోనే రిబ్బన్ కటింగ్ విషయంలో మరోసారి రచ్చ జరుగుతుంది. మీనాతో చేయిద్దామని సత్యం అంటే ప్రభావతి వద్దంటుంది. దీంతో బాలు మరోసారి ఆమెపై విరుచుకుపడతాడు.

అయితే ప్రభావతికి సపోర్ట్ గా రోహిణి, మనోజ్, రవి, శృతి వస్తారు. దీంతో చేసేది లేక మనకు లక్ష్మీ, పార్వతి, సరస్వతిలాగా ముగ్గురు కోడళ్లు ఉన్నారు కదా.. ముగ్గురితోనూ చేయిద్దామని సత్యం అనడంతో ప్రభావతి ఇష్టం లేకపోయినా సరే అంటుంది.

ఆ తర్వాత అందరూ ప్రభావతిని డ్యాన్స్ చేయమని అడుగుతారు. దీంతో ఆమె ఎంతో మురిసిపోతూ కాళ్లకు గజ్జలు కట్టుకొని కాసేపు డ్యాన్స్ చేసి అలరిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ చప్పట్లతో ఆమెను ప్రశంసిస్తారు.

ప్రభావతి డ్యాన్స్ స్కూల్‌పై కుటుంబం చర్చ

ఇటు ప్రభావతి తప్ప మిగిలిన వాళ్లందరూ ఇంటికి తిరిగి వస్తారు. ఈ వయసులో ఆమె డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టడం బాగుండదు.. డ్యాన్స్ చేస్తూ ఆమెకు ఏమైనా అయితే ఎలా అని సత్యం అంటాడు. బాలు కూడా అతనికే సపోర్ట్ చేస్తారు. కానీ మనోజ్, రోహిణి, శృతి మాత్రం ప్రభావతి చేసింది కరెక్టే అని వాదిస్తారు. అటు మీనా కూడా వచ్చి ఇంట్లో అందరం సంపాదిస్తున్నాం.. ఆమె సంపాదన ఆమె చేసుకోనివ్వండి.. ఆమెకు ఏమైనా అయితే మనమందరం చూసుకోవడానికి ఉన్నాం కదా అని అంటుంది. దీంతో అందరూ కరెక్టే అనుకొని వెళ్లిపోతారు.

ప్రభావతికి షాకిచ్చిన లైన్ మ్యాన్

అటు కామాక్షి ఇంట్లో డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టి స్టూడెంట్స్ కోసం ప్రభావతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి ఎవరు వచ్చి బెల్ కొట్టినా ఆశగా చూస్తుంది. ఓసారి నీళ్ల వాడు, మరోసారి కిరాణా షాపు వాడు వస్తారు. ఆ తర్వాత ఓ వ్యక్తి వచ్చి డ్యాన్స్ స్కూల్ గురించి అడుగుతాడు. తమ పిల్లలను చేర్పించడానికి వచ్చాడేమో అనుకొని అతడు అడిగిన వివరాలన్నీ ప్రభావతి చెబుతుంది.

ఈ నెల 40 మంది, వచ్చే నెల మరో 40 మంది వస్తారు.. రోజూ ఉదయం 2, సాయంత్రం 2 క్లాసులు తీసుకుంటాను.. ఒక్కో స్టూటెండ్ కు రూ.2 వేలు ఫీజు వసూలు చేస్తున్నాను అని ప్రభావతి చెబుతుంది. దీంతో ఆ వచ్చిన వ్యక్తి తన పిల్లలను చేర్పించడానికి కాదు.. తాను కరెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చానని, మీరు ఇంట్లో బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీటర్ ను కమర్షియల్ గా మార్చాల్సి ఉంటుందని చెప్పడంతో కామాక్షి లబోదిబోమంటుంది.

వచ్చిన ఒక్క స్టూడెంట్‌నూ వెళ్లగొట్టిన కామాక్షి

ఇప్పటికే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందనుకుంటే.. ఇప్పుడు మీటర్ కమర్షియల్ కావడంతో కామాక్షి బాధపడుతుంది. వచ్చిన వాళ్లు ఎవరో తెలుసుకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తావా అంటూ ప్రభావతిని తిడుతుంది. ఆ తర్వాత ఇంటికి ఎవరో వచ్చి బెల్లు కొడతారు.

ఓ వ్యక్తి తన కూతురిని తీసుకొని వచ్చి ఇక్కడ డ్యాన్స్ నేర్పిస్తున్నారా అని అడుగుతాడు. కానీ కామాక్షి మాత్రం అదేమీ లేదు.. ఎవరో తమ ఇంటికి బోర్డు పెట్టి వెళ్లారని చెబుతుంది. దీంతో ప్రభావతి కంగారుగా వెళ్లి తానే డ్యాన్స్ నేర్పిస్తానని అంటుంది. కానీ ఆ వ్యక్తి వీళ్లు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడటం చూసి తన కూతురిని చేర్పించకుండానే వెళ్లిపోతాడు.

ప్రభావతి బాధ.. క్లాస్ పీకిన సత్యం

దీంతో ప్రభావతి మరింత బాధపడుతుంది. చీకటి పడినా ఒక్కరూ రాకపోవడంతో ఇంట్లో ఏమీ తినకుండా ఆమె దిగాలుగా కూర్చుంటుంది. దీంతో ఏం జరిగిందని సత్యం అంటాడు. ఒక్కరూ రాలేదని, ఈ ఊళ్లో అసలు ఎవరికీ భరతనాట్యం విలువ తెలియదని ప్రభావతి అంటుంది. దీంతో సత్యం ఆమెకు క్లాస్ పీకుతాడు.

అప్పుడే అలా అంటే ఎలా.. అయినా డ్యాన్స్ స్కూల్ మొదలుపెట్టినప్పుడే అవన్నీ ఆలోచించుకోవాలి అని తిడతాడు. అప్పుడే బాలు కూడా రావడంతో అతన్ని, మీనాను కలిపి తిడుతుంది ప్రభావతి. భరతనాట్యం అంటే కారు నడపడం, పూలు కట్టడం కాదంటూ వాళ్లను ఎగతాళి చేస్తుంది. తన డ్యాన్స్ క్లాస్ ప్రారంభించిన మీనా వల్లే ఇలా జరిగిందంటూ ప్రభావతి వెళ్లిపోతుంది.

దీంతో మరుసటి రోజు బాలు, మీనానే ప్రభావతి దగ్గరికి డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తారు. ప్రభావతి తిడుతున్నా పట్టించుకోకుండా డ్యాన్స్ నేర్పించమని అడుగుతారు. అది అంత సులువైన పని కాదని ప్రభావతి ఛాలెంజ్ విసరగా.. మీనా సై అంటుంది. తాను నేర్చుకుంటానని, మీతో సమానంగా డ్యాన్స్ చేస్తానని ప్రభావతితో అంటుంది. అక్కడితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024