





Best Web Hosting Provider In India 2024

మీరు హీరో మెటీరియలా? వివాదం.. ప్రదీప్‌ను రజనీకాంత్, ధనుష్‌తో పోల్చిన నాగార్జున.. బిగ్ బాస్‌లో డ్యూడ్‌పై ప్రశంసలు
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లోకి అతిథులుగా ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు, నటుడు శరత్ కుమార్ వచ్చారు. ఈ క్రమంలో ప్రదీప్‌ను రజనీకాంత్, ధనుష్‌తో పోల్చారు హోస్ట్ నాగార్జున.
“మీరు హీరో మెటిరీయల్ కాదు. కానీ, ఇలా జరగడం హార్డ్ వర్కా లేక అదృష్టమా?” అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా హీరో మెటీరియల్ టాపిక్ వివాదంగా కూడా మారింది. నిజానికి ఇది డ్యూడ్ అనే మూవీ ప్రమోషన్స్‌లో జరిగిన సంఘటన.
నిజాయితీగా సమాధానం
లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో అలరించిన డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఇలా అడిగిన ప్రశ్న ఇది. దానికి శరత్ కుమార్ ఘాటుగా, ప్రదీప్ రంగనాథన్ కూల్‌గా తెలివిగా, నిజాయితీగా సమాధానం ఇచ్చారు.
నాగార్జున కామెంట్స్
అయితే, ఈ టాపిక్ కాంట్రవర్సీ అవ్వడం, దీనిపై కిరణ్ అబ్బవరం కూడా స్పందించడం వంటివి జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రదీప్ రంగనాథన్ రియల్ హీరో అంటూ కింగ్ నాగార్జున చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. బిగ్ బాస్ తెలుగు 9 సీజన్‌కు హోస్ట్‌గా నాగార్జున చేస్తున్న విషయం తెలిసిందే.
డ్యూడ్ సినిమా ప్రమోషన్స్
అక్టోబర్ 12 ఆదివారం నాడు బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ 2.O నిర్వహించి కొత్తగా ఆరుగురు కంటెస్టెంట్స్‌ను రాయల్ ఎంట్రీగా పంపారు. ఈ క్రమంలోనే డ్యూడ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్‌లోకి అతిథులుగా ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు, నటుడు శరత్ కుమార్ హాజరయ్యారు.
రజనీకాంత్, ధనుష్‌తో పోలుస్తూ
ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌజ్‌లో ప్రదీప్ రంగనాథన్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో ధనుష్‌తో పోలుస్తూ ప్రశంశలు కురిపించారు నాగార్జున. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రియల్ హీరోవి ప్రదీప్
“కొన్ని దశాబ్ధాల క్రితం గ్లామర్‌తో సంబంధం లేకుండా ఒక మెరుపు తీగ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సూపర్ స్టార్‌గా మారాడు. ఆయనే రజనీకాంత్. ఆ తర్వాత బక్కగా ఉండే ఓ కుర్రాడు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా మారి శభాష్ అనిపించుకున్నాడు. అతనే ధనుష్. ఇక ఇప్పుడు ఈ జనరేషన్‌లో డైరెక్టర్‌గా అడుగుపెట్టి నటుడిగా సూపర్ బ్లాక్ బస్టర్స్ అందుకుని హీరో అవ్వాలంటే గ్లామర్‌తో పని లేదు టాలెంట్ ఉంటే చాలు అని నిరూపించావ్ ప్రదీప్. నువ్వు రియల్ హీరోవి” అని నాగార్జున అన్నారు.
ఇది నా అదృష్టం
దానికి ప్రదీప్ రంగనాథన్ చాలా సంతోషించాడు. “మీ నుంచి ఇంతటి కాంప్లిమెంట్ తీసుకోవడం నా అదృష్టం” అని ప్రదీప్ రంగనాథన్ బదులిచ్చాడు. ఆ తర్వాత రాక్షసుడు సినిమా చూసి నాగార్జునలా తాను హెయిర్ పెంచుకున్నట్లు తెలిపాడు ప్రదీప్ రంగనాథన్.
సంబంధిత కథనం
