Best Web Hosting Provider In India 2024
Sangareddy District : ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా ఫోన్ లో మాట్లాడుతూ అతివేగంగా బస్సు నడపడం… ఓ ప్రభుత్వ ఉపాద్యాయుని ప్రాణాలు తీసింది, తీవ్రంగా గాయపడ్డ మరొక ఉపాద్యాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయంలోకి వెళితే, ఉపాధ్యాయులు పిట్ల రాజ్ కుమార్ (39), సందీప్ ఇద్దరు కూడా అందోల్ మండలంలోని తాలెల్మా గ్రామంలోని ప్రాధమిక పాఠశాలలో గత కొంత కాలంగా ఉపాద్యాయులుగా పనిచేస్తున్నారు. వారిద్దరూ కూడా, జోగిపేట పట్టణంలో నివసిస్తూ, ప్రతిరోజు తమ ద్విచక్రవాహనం పైన, పాఠశాలకు కలిసి వెళ్లి వస్తుంటారు. తమ రోజు వారి దినచర్యలో భాగంగా, వారిద్దరూ కూడా జోగిపేట నుండి తాలెల్మా వైపు వెళ్తుండగా, ఎదురుగ వస్తున్నా బస్సు అతివేగంతో వచ్చి, వారి ద్విచక్రవాహనంతో డీ కోట్టింది. ఇద్దరు కూడా తీవ్ర గాయాలకు పాలయ్యారు.
ట్రెండింగ్ వార్తలు
హెల్మెట్ కూడా ప్రాణం కాపాడలేకపోయింది…
రాజ్ కుమార్ హెల్మెట్ ధరించిన, బస్సుతన తలకు గట్టిగా తగలడంతో హెల్మెట్ తలా నుండి విడిపడి అల్లంత దూరాన ఎగిరిపడింది. తీవ్ర గాయాల పాలైన, సందీప్ ను జోగిపేట ఆసుపత్రికి తరలించి, అక్కడ ప్రధమ చికిత్స తర్వాత, హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. సంఘటన గురించి తెలుసుకున్న, టీచర్స్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ గా గెలుపొందిన, ఎం రఘోత్తం రెడ్డి జోగిపేటలోని రాజ్ కుమార్ నివాసానికి వచ్చి శ్రద్ధాంజలి ఘటించాడు. తాలెల్మా గ్రామస్థులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాజ్ కుమార్ కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భార్య అనురాధ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, జోగిపేట పోలీసులు విచారణ చేస్తున్నారు. బస్సు డ్రైవర్, ఫోన్ మాట్లాడుతూ, బస్సు నడుపుతున్నాడని బస్సు లోని ప్రయాణికులు పోలీసులకు తెలిపారు.
అతివేగానికి మరొక ప్రాణం బలి….
సిద్దిపేట జిల్లాలో అతివేగం, మరొక యువకుని ప్రాణాలు తీసింది. కరీంనగర్ పట్టణానికి చెందిన, ఆకారపు సాయికుమార్ రెడ్డి (31) ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రోజు తన ద్విచక్రవాహనం పైన, హైదరాబాద్ నుండ, కరీంనగర్ కి వెళ్తుండగా గజ్వేల్ మండలంలోని కొడకండ్ల గ్రామా శివారులో ట్రాక్టర్ ను ఢీ కొట్టడంతో తాను అక్కడిక్కడే మృతిచెందాడు. ఎస్సై పుష్పరాజ్ కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగం, అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని, పుష్పరాజ్ తెలిపారు.
రిపోర్టింగ్ : సంగారెడ్డి జిల్లా ప్రతినిధి