Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu Promo: రిషిని కిడ్నాప్ చేసి వసుధారను బెదిరించినందుకు శైలేంద్ర ప్రాణాలను తీయాలని ఫిక్సవుతాడు మహేంద్ర. గన్‌తో శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు. కానీ మహేంద్ర ఎంత భయపెట్టిన రిషికి ఎక్కడున్నాడో తనకు తెలియదని శైలేంద్ర అంటాడు. శైలేంద్రను ర షూట్ చేస్తోండగా అనుపమ, వసుధార వచ్చి మహేంద్రను అడ్డుకుంటారు. దాంతో బుల్లెట్ మిస్సవుతుంది. ఈ రోజు బతికిపోయినా నిన్ను ఎప్పటికైనా నేను చంపేస్తానని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర.
ట్రెండింగ్ వార్తలు
దేవయాని యాక్టింగ్
మహేంద్ర బెదిరించిన సీన్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటారు శైలేంద్ర, దేవయాని. భర్త ఫణీంద్రకు మహేంద్రపై చాడీలుచెబుతారు. అప్పుడు జగతి హత్యకేసులో, ఇప్పుడు రిషి మిస్సింగ్ తన కొడుకునే అనుమానిస్తున్నారంటూ ఎమోషనల్ అవుతున్నట్లుగా యాక్టింగ్ చేస్తుంది దేవయాని. జగతి హత్యలో శైలేంద్ర పాత్ర ఉందని మహేంద్ర, వసుధారతో పాటు ముకుల్ కూడా అనుమానిస్తున్నారంటే తన కొడుకు నిజంగానే ఆ తప్పు చేశాడా అని ఫణీంద్ర డౌట్ పడతాడు. ఇదే విషయంపై శైలేంద్రను నిలదీయాలని అనుకునేలోపు దేవయాని అతడిని డైవర్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళుతుంది.
శైలేంద్ర నిజస్వరూపం
తన నిజ స్వరూపం భార్య ధరణికి తెలిసిపోయిందని శైలేంద్ర గ్రహిస్తాడు. మంచివాడిగా ఇన్నాళ్లు ఆడిన నాటకం వృథా కావడంతో లోలోన రగిలిపోతాడు. దీనంతటికి కారణం వసుధార అని ఫిక్సవుతాడు శైలేంద్ర. తనను తండ్రితో పాటు మహేంద్ర ముందు ఇరికించిన వసుధారపై రివేంజ్ తీర్చుకోవడానికి మరో ఎత్తు వేస్తాడు? రిషి ప్రాణాలకు ప్రమాదం తలపెట్టాలని అనుకుంటాడు. అతడి ప్లాన్‌ను వసుధార ఎలా తిప్పికొట్టింది? శైలేంద్ర బారి నుంచి తన భర్తను కాపాడుకుందా? లేదా? కొడుకును కాపాడుకోవడానికి అనుపమతో కలిసి మహేంద్ర ఎలాంటి సాహసం చేశాడన్నది రేపటి గుప్పెడంత మనసు సీరియల్‌లో చూడాల్సిందే.