




ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.16-9-2022(శుక్రవారం) ..
పట్టణంలోని సీఎం రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
త్వరలోనే గ్రేడ్-2 మున్సిపాలిటీగా నందిగామ నగర పంచాయతీ ..
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నందిగామ పట్టణాన్ని తీర్చిదిద్దుతాం ..
నందిగామ పట్టణంలోని సీఎం రోడ్డు విస్తరణ -అభివృద్ధి పనులలో భాగంగా రూ.38 లక్షలతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శుక్రవారం శంకుస్థాపన నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నందిగామ పట్టణానికి ప్రత్యేక నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని , అందులో భాగంగానే పట్టణంలో రోడ్ల నిర్మాణం -సిసి డ్రైన్ ల నిర్మాణాలు – ఇంటింటికి కుళాయి నిర్మాణ పనులను చేపట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు ,
ముఖ్యంగా పట్టణీకరణ లో భాగంగా సీఎం రోడ్డు విస్తరణ -అభివృద్ధి పనులు చేపట్టాలని , రోడ్డు విస్తరణకు సహకరించిన సీఎం రోడ్డు నివాసితులకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ,పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టామని ,సీఎం రోడ్డులో ఇప్పటికే ఇరువైపులా పక్కా డ్రైనేజీలు ,విద్యుత్ దీపాలంకరణ పనులు పూర్తయ్యాయని – సీఎం రోడ్డు ను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు , త్వరలోనే నందిగామ నగర పంచాయతీ గ్రేడ్-2 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ అవుతుందని , తద్వారా మరింత అభివృద్ధి జరగడానికి ప్రత్యేక నిధులు మంజూరు అవుతాయని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నందిగామ నగర పంచాయతీ కమిషనర్ ,ఏఈ ,నగర పంచాయతీ కౌన్సిల్ సభ్యులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#arun_kumar_monditoka
#jagan_mohan_rao_monditoka