YSRCP Nandigama:




ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.17-9-2022(శనివారం) ..
అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం వై.యస్.జగన్ ప్రభుత్వ లక్ష్యం ..
చందాపురం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని చందాపురం గ్రామంలో శనివారం ఉదయం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ,మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ,అన్ని వర్గాల ప్రజల సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు , ఇచ్చిన హామీలలో 95 శాతం నెరవేర్చి చేతల ప్రభుత్వంగా ముఖ్యమంత్రి ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు , అర్హత ప్రామాణికంగా కుల మత వర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ,ఈ సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిరుమామిళ్ల చందన కిరణ్, సీనియర్ నాయకులు కోవెలమూడి వెంకటనారాయణ ,శివ నాగేశ్వరరావు , రమేష్ తదితరులు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#arun_kumar_monditoka
YSRCP Nandigama : ఐతవరం గ్రామంలో యడవల్లి కృష్ణ గౌడ్ గారి సంస్మరణ కార్యక్రమంలో