



ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
అంబారుపేట గ్రామ సచివాలయ సిబ్బంది – వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పేర్కొన్నారు ..
నందిగామ మండలంలోని అంబారుపేట గ్రామ సచివాలయంలో గ్రామపంచాయతీ అధికారులు , వాలంటీర్లు -సచివాలయం ఉద్యోగులతో శనివారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు , ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబారుపేట సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిందని , గ్రామంలో ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు , గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఒక్కో సచివాలయానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రూ.20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నారని, ఆ నిధులతో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని తెలిపారు , సచివాలయాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై తప్పనిసరిగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని చెప్పారు , పనులలో అలసత్వం వహిస్తున్నట్లు ఫిర్యాదులు అందితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐలపోగు రమాదేవి రామయ్య ,వైస్ ఎంపీపీ అన్నం పిచ్చయ్య ,సిఐ కనకారావు ,తదితరులు పాల్గొన్నారు ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#arun_kumar_monditoka