Best Web Hosting Provider In India 2024

Aadikeshava OTT Release Date: ఉప్పెన మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ నటించిన మూవీ ఆదికేశవ. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపని ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. శ్రీలీల కూడా నటించిన ఈ మూవీ వచ్చే శుక్రవారం (డిసెంబర్ 22) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ రెడ్డి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
ఆదికేశవ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పూర్తిగా మాస్ అవతార్ లో కనిపించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ కింద నాగ వంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. అయితే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ఆదికేశవ ఎలా ఉందంటే?
ఆదికేశవ మాస్ మాసాల హంగులతో కూడిన ఫక్తు కమర్షియల్ మూవీ. హీరో ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డుచెప్పడం, హీరోకు ఓ పెద్ద ప్లాష్‌బ్యాక్ ఉండటం, విలన్‌పై రివేంజ్ కోసం సీమలో అడుగుపెట్టడం అనే కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఎన్నో సినిమాలొచ్చాయి. వాటి ఛాయలతోనే ఆదికేశవ సినిమా సాగుతుంది.
కథ, కథనాల విషయంలో కొత్తదనం ఉండదని ప్రమోషన్స్‌లోనే దర్శకనిర్మాతలు క్లారిటీ ఇచ్చి ఆడియెన్స్‌ను ముందుగానేప్రిపేర్ చేశారు. అందుకు తగ్గట్లే ట్రైలర్స్, టీజర్స్ కట్ చేశారు. వారి మాటలకు తగ్గట్లుగానే సినిమా ఆద్యంతం రోటీన్‌గా సాగుతుంది. హీరో ఫ్లాష్‌బ్యాక్ బయటపడినప్పుడే క్లైమాక్స్ ఎలా ఉంటుందన్నది అర్థమైపోతుంది. సీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలన్ని గుర్తొస్తాయి.
గత సినిమాల్లో లవర్‌బాయ్‌గా, పక్కింటికుర్రాడి తరహాలో సాఫ్ట్ క్యారెక్టర్స్ చేశాడు వైష్ణవ్‌తేజ్. ఆ పంథాకు భిన్నంగా ఔట్ అండ్ ఔట్ మ్యాస్ క్యారెక్టర్‌ను ఆదికేశవలో కనిపించాడు. డ్యూయల్‌షేడ్స్‌తో సాగే క్యారెక్టర్‌లో మెప్పించాడు. శ్రీలీల గ్లామర్,డ్యాన్సులతో ఆకట్టుకుంది. రొటీన్ విలన్ పాత్రకు తన యాక్టింగ్‌తో ప్రాణం పోశాడు జోజు జార్జ్. సదా, రాధిక శరత్‌కుమార్, సుమన్ పాత్రల్లో కొత్తదనం కనిపించదు.