Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari december 18th:: మురారి, కృష్ణ బైక్ మీద వెళ్తూ ఉంటారు. కృష్ణ సరదాగా సినిమాకు వెళ్దామా అంటుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి? వచ్చే శుక్రవారం పెళ్లి పెట్టుకుని కాస్త భయం కూడా లేకుండా ఉంటున్నావని అంటాడు. నాకు మాత్రం టెన్షన్ ఉండదా పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఉంటానా ఏంటి తొక్కి పట్టి నార తీస్తానని చెప్తుంది. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. భవానీ అత్తయ్య తనని క్షమించడం లేదని బాధపడుతుంది.
ట్రెండింగ్ వార్తలు
ముకుంద తన అన్నయ్య దేవ్ ని కలిసేందుకు జైలుకి వెళ్తుంది. ఇక నాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది మురారి నిజం బయట పెడతాడు. కనీసం పెళ్లి అయిన తర్వాత గతం గుర్తుకు వస్తే నా తిప్పలు ఏవో నేను పడేదాన్ని కదా అనుకుంటుంది. పెద్దపల్లి ప్రభాకర్ కూడ అదే జైల్లో ఉన్నాడని ముకుందకి తెలుస్తుంది. ఇక తన అన్నయ్యని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
దేవ్ కి విషయం చెప్పేసిన ముకుంద
మురారికి గతం గుర్తుకు వచ్చిందని చెప్పేసరికి షాక్ అవుతాడు. తనకి సర్జరీ చేయించింది ప్రభాకర్ కాదని ఇంకెవరో చేయించారు. ప్రభాకర్ అయితే తనకి గుర్తుకు వచ్చేవాడు కదా అన్నాడు. ఎంక్వైరీ మొదలు పెట్టాడు. ఇప్పుడే ఇక్కడ ఉన్న ప్రభాకర్ ని కలవడానికి వచ్చాడని చెప్తుంది.
వచ్చే శుక్రవారం పెళ్లి అని చెప్పావ్ కదా అది ఏమైందని అడుగుతాడు. వద్దని అన్నాడు వచ్చే శుక్రవారం లోపు దోషిని పట్టుకుంటానని అన్నాడు. పట్టుకోకపోతే అని పెద్దత్తయ్య అంటే పెళ్లి చేసుకుంటానని ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకున్నారని అంటుంది. నువ్వేం భయపడకు రేపో మాపో నాకు బెయిల్ వస్తుంది. నేను చక్రం తిప్పుతానని ధైర్యం చెప్తాడు. ఈలోపు నువ్వుదొరికిపోతే ఏంటి పరిస్థితని భయపడుతుంది. కానీ దేవ్ మాత్రం పెళ్లి గ్యారెంటీగా అవుతుందని నమ్మకంతో ఉండు టెన్సిన్ పడకని చెప్పడంతో వెళ్ళిపోతుంది.
సంక్రాంతికి ఇంటికి వచ్చేస్తారన్న మధుకర్
రేవతి, మధుకర్ కృష్ణ చిన్నమ్మ శకుంతలని కలవడానికి వస్తారు. కూతురు, అల్లుడు కలిసి బయటకి వెళ్లారు కదా ఏం చెప్పారని రేవతి అడుగుతుంది. లగ్గంలోపే ఈ కేసు ఖతం అయితే బాగుంటుందని కాసేపు మాట్లాడుకుంటారు. ఈ తక్కువ టైమ్ లో కేసు పరిష్కరిస్తారా లేదా అని రేవతి భయపడుతుంది. మధుకర్ మాత్రం ధైర్యంగా మురారి వాళ్ళు గెలుస్తారని చెప్తాడు. ఈ సంక్రాంతికి అందరం కలిసి ఉంటామని ధైర్యం చెప్తాడు.
మురారి, కృష్ణ ప్రభాకర్ ని కలిసేందుకు వస్తారు. వాళ్ళని దూరం నుంచి ముకుంద చూసి టెన్షన్ పడుతుంది. కృష్ణ ఎక్కడ తమని చూస్తుందేమోనని ముకుంద వెళ్ళి కనిపించకుండా పక్కకి వెళ్ళిపోతుంది. మురారి వాళ్ళకి తాను కనిపిస్తే వీళ్ళు కలిసిపోయినట్టే అవుతుందని అనుకుంటుంది. కృష్ణ మురారికి గతం గుర్తుకు వచ్చిందని చెప్తుంది. ఆ మాట విని ప్రభాకర్ చాలా సంతోషపడతాడు. నేరం చేసింది నువ్వు కాదని మాయన పెద్దత్తయ్యతో చెప్పేశారని అంటుంది. అయితే లగ్గం లేనట్టేగా అని ప్రభాకర్ అడుగుతాడు.
నా భార్య కృష్ణ.. ఇంకెవరికీ చోటు లేదన్న మురారి
తన కళ్ళ ముందే నువ్వు జైలుకి వెళ్ళావ్ కదా అదే నిజమని అనుకుంటుంది. మేము అసలు దోషులని పట్టుకుంటామని కృష్ణ చెప్తుంది. ఈలోపు ఖచ్చితంగా పట్టుకుంటాను. నీ కూతురే నా భార్య ఇంకెవరికీ ఆ స్థానం ఇవ్వనని మురారి తేల్చి చెప్పడంతో ప్రభాకర్ కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతాడు. కానీ ఈలోపు దొరుకుతాడా అని టెన్షన్ పడతాడు. మీ బిడ్డ కోసం చేయని నేరం మీమీద వేసుకున్నారు. అసలు దోషిని ఎలాగైనా పట్టుకుంటానని మురారి హామీ ఇస్తాడు. నేను అరెస్ట్ కాకపోతే నా బిడ్డని ఎక్కడ లోపల వేస్తారోనని భయమేసిందని చెప్తాడు.
మీరు హ్యాపీగా ఇంటికి వస్తారు. మీ బిడ్డ జీవితాంతం నాతోనే ఉంటుందని మురారి అంటాడు. కృష్ణ భుజం మీడ చెయ్యి వేసి మురారి తనే ఎప్పటికీ నా భార్య అనడంతో సంతోషపడతారు. ముకుంద ఒంటరిగా నిలబడి దేవ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దేవ్ నాకు ధైర్యం చెప్పినా ఎందుకు టెన్షన్ గా ఉంది. శిఖర్ దేవ్ అని తెలిస్తే నా పరిస్థితి ఏంటని వణికిపోతుంది.
రేపటి ఎపిసోడ్ ప్రోమోలో ఏముందంటే..
మురారి డాక్టర్ పరిమళని కలిసినట్టు ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. తనకి సర్జరీ చేయించిన వ్యక్తి పేరు ఏంటో తెలిసింది. అతను ఎలా ఉంటాడు, హైట్ అవన్నీ కనుక్కున్నాను అని చెప్తాడు. అతని పేరు ఏంటని భవానీ అడుగుతుంటే ముకుంద టెన్షన్ పడుతుంది. అది కృష్ణ గమనిస్తుంది.