Salaar Release Trailer: సలార్ నయా ట్రైలర్ రిలీజ్.. దద్దరిల్లేలా యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్

Best Web Hosting Provider In India 2024

Salaar Release Trailer: సినీ ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న సలార్ సినిమా నుంచి యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది. ఈ కొత్త రిలీజ్ ట్రైలర్‌ను నేటి (డిసెంబర్ 18) ఉదయం తీసుకొస్తామని ప్రకటించిన మూవీ యూనిట్.. కాస్త ఆలస్యం తర్వాత మధ్యాహ్నం విడుదల చేసింది. సలార్ చిత్రానికి పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ మూవీపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సలార్ సునామీ సృష్టిస్తుందనేలా ట్రెండ్ కనిపిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ సలార్ చిత్రానికి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 22న ‘సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్’ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓ ట్రైలర్ రాగా.. అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు దద్దరిల్లిపోయే యాక్షన్‍తో నేడు (డిసెంబర్ 18) మరో రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు

సలార్ నుంచి ఈనెల ప్రారంభంలో వచ్చిన మొదటి ట్రైలర్ ఎక్కువగా దేవ (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) ఫ్రెండ్‍షిప్, ఖాన్సార్ సిటీ కోసం పోరాటాలు, వరదకు దేవ సాయం చేసేందుకు రావడం లాంటి వాటిని చూపించారు. యాక్షన్ పార్ట్ కాస్త తక్కువగానే ఉంది. అయితే, నేడు వచ్చిన రెండో ట్రైలర్ మాత్రం యాక్షన్ ధమాకాలా ఉంది. యాక్షన్‍ సీక్వెన్సులతో, పవర్ ఫుల్ డైలాగ్‍లతో నిండిపోయింది.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా సలార్ రూపొందింది. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‍గా నటించారు. జగపతి బాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయారెడ్డి కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతం అందించారు. ఇప్పటికే వచ్చిన ‘సూరీడే’ ఫ్రెండ్‍షిప్ సాంగ్ సూపర్ పాపులర్ అయింది. హొంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *