Best Web Hosting Provider In India 2024

Niharika Konidela: మంచు మనోజ్ సినిమాలకు దూరమై ఐదేళ్లు దాటిపోయింది. వాట్ ది ఫిష్ మూవీతో తాను రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా రోజుల క్రితం మంచు మనోజ్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేశాడు. పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు ప్రకటించాడు.ఆ తర్వాత వాట్ ది ఫిష్ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. తాజాగా వాట్ ది ఫిష్ మూవీ నుంచి నిహారిక కొణిదెల ఫస్ట్ లుక్‌ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమాతో నిహారిక సిల్వర్ స్క్రీన్‌పై కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.వాట్ ది ఫిష్‌లో నిహారిక లీడ్ రోల్ చేస్తున్నట్లు అనౌన్స్‌చేశారు. పోస్టర్స్‌తో పాటు సినిమా యూనిట్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్స్, పోస్ట్‌లలో ఎక్కడ మంచు మనోజ్ పేరు కనిపించలేదు. మంచు మనోజ్ కూడా నిహారిక ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు.
దాంతో ఈ సినిమా నుంచి మంచు మనోజ్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడి ప్లేస్‌లో నిహారిక లీడ్ రోల్‌గా వాట్ ది ఫిష్ మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వాట్ ది ఫిష్ మూవీలో అష్టలక్ష్మి అలియాస్ ఎస్‌హెచ్ పాత్రలో నిహారిక కనిపించబోతున్నట్లు సినిమా టీమ్ ప్రకటించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నిహారిక గ్లామర్ లుక్‌లో కనిపిస్తోంది. ఆమె వెనుక డాలర్ సింబల్ ఉండటం ఆసక్తిని పంచుతోంది.
వాట్ ది ఫిష్ సినిమాకు వరుణ్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2019లో రిలీజైన సూర్యకాంతం తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం అనంతరం నిహారిక కొణిదెల నటిస్తోన్న సినిమా ఇది. డెడ్ పిక్సెల్స్ వెబ్‌సిరీస్‌తో ఈ ఏడాది యాక్టింగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది నిహారిక.
టాపిక్