Best Web Hosting Provider In India 2024

Hanuman Trailer: తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న హనుమాన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. స్టన్నింగ్ విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ట్రైలర్ సినీ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. సూపర్ హీరోగా తేజా సజ్జా యాక్టింగ్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. హనుమాన్ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
సూపర్ హీరో కథాంశానికి భక్తిని మిక్స్ చేస్తూ హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తోన్నాడు. జాంబీ రెడ్డి తర్వాత తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ ఇది. అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.
వాన ఫేమ్ వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తోన్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా హనుమాన్ మూవీ రాబోతోంది. సంక్రాంతి హనుమాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్‌బాబు గుంటూరుకారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగలతో పోటీగా హనుమాన్ రిలీజ్ కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.