Best Web Hosting Provider In India 2024

Guppedantha Manasu December 19th Episode: తనను బెదిరించిన వసుధారతో పాటు మహేంద్రపై ప్రతీకారం తీర్చుకోవడానికి శైలేంద్ర కొత్త ప్లాన్ వేస్తాడు. కాలేజీ బోర్డ్ మీటింగ్ ఏర్పాటుచేయిస్తాడు. ఆ బోర్డ్ మీటింగ్ కోసం రెడీ అవుతుంటాడు. పూర్తిగా కోలుకున్న తర్వాత కాలేజీకి వెళ్లడం మంచిదని కొడుకును మందలిస్తుంది దేవయాని. కానీ తాను వెళ్లితీరాల్సిందేనని శైలేంద్ర పట్టుపడతాడు. తాన ఇంట్లో ఉంటే బాబాయ్ కోపంగా వచ్చి రచ్చరచ్చ చేశాడని అంటాడు. మహేంద్ర అలా చేస్తాడని తాను ఊహించలేదని, అనుపమ, వసుధార రాకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదని దేవయాని అంటుంది.
ట్రెండింగ్ వార్తలు
ధరణి సెటైర్…
అందరికి నా పరిస్థితి తెలియాలి. నేను ఏం చేస్తున్నానో తెలియాలి. అందుకోసమైనా కాలేజీకి వెళతానని తల్లితో చెబుతాడు శైలేంద్ర. శైలేంద్ర కాలేజీకి వెళ్లబోతున్నాడని తెలిసి భర్తపై సెటైర్స్ వేస్తుంది ధరణి. కాలేజీకి వెళ్లి శైలేంద్ర ఏ పని చేస్తుంటాడని దేవయానితో అంటుంది. ఫైల్స్ చెక్ చేస్తుంటాడని వ్యంగ్యంగా కోడలికి బదులిస్తుంది దేవయాని. ఆ ఫైల్స్ ఏవో మావయ్యకు చెప్పి ఇక్కడికే తెప్పిస్తానని ధరణి అంటుంది. . కానీ తాను కాలేజీకి వెళ్లాల్సిందేనని శైలేంద్ర పంతం పడతాడు.
ఆత్మగౌరవం ముఖ్యం…
నాకు నా ఆరోగ్యం కంటే ఆత్మగౌరవం ముఖ్యంమని భార్యతో చెబుతాడు శైలేంద్ర. రిషి కనిపించకుండా పోవడానికి కారణం తానేనని బాబాయ్ నన్ను అనుమానించడం తట్టుకోలేకపోతున్నానని అంటాడు. కాలేజీకి వెళ్లి రిషి గురించి ఎంక్వైరీ చేసి అతడు ఎక్కడున్నాడో కనిపెడతానని చెబుతాడు.
కాలేజీకి సొంతం చేసుకోవడానికి ఏదో ప్లాన్ వేసుకొని వెళుతున్నాడని గ్రహించిన ధరణి… శైలేంద్ర వెంట తాను వస్తానని అంటుంది. కానీ దేవయాని ఒప్పుకోదు. శైలేంద్ర ప్రాణాలు ప్రమాదంలో పడటానికి నువ్వే కారణమని, నువ్వు పక్కనుండగానే అతడిపై ఎటాక్ జరిగిందని నానా మాటలు అంటుంది. శైలేంద్ర వెంట తాను కాలేజీకి వెళతానని, నువ్వు ఇంటి పనులు చూసుకో అని చెబుతుంది.
వసుధార గిల్టీ ఫీలింగ్…
రిషి కనిపించకుండా పోయిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడం కోసం అతడు మిషన్ ఎడ్యుకేషన్ పనుల మీద అవుట్ ఆఫ్ స్టేషన్‌కు వెళ్లాడని తాను నోటీస్ ఇవ్వడంపై వసుధార బాధపడుతుంది. అదే విషయం వసుధారను అడుగుతుంది అనుపమ. అలా చేసినందుకు నాకు గిల్టీగానే ఉందని, కానీ చేయాల్సివచ్చిందని చెబుతుంది.
జగతి మేడమ్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని కాలేజీని ముందుకు నడిపించారని వసుధార ఎమోషనల్ అవుతుంది. జగతి మేడమ్ స్ఫూర్తితో రిషికి ఇచ్చిన మాటకు కట్టుబడి తాను ఎండీ సీట్‌లో కూర్చున్నానని అంటుంది. ఎండీ సీట్ కోసం జరిగిన కుట్రలో రిషి కనిపించకుండాపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
వసుధార పేరు బ్రాండ్…
రిషి కాకుండా తాను కనిపించకుండాపోయిన బాగుండేదని అంటుంది. అస్తమించిన సూర్యుడు చీకటి పొరలను చీల్చుకొని వచ్చినట్లుగా రిషి కూడా తేజస్సుతో బయటకు వస్తాడని వసుధారను ఓదార్చుతుంది అనుపమ. వసుధార అన్న పేరు బ్రాండ్. నువ్వు ఎదుగిన గ్రాఫ్ నలుగురికి ఆదర్శం. కష్టాలకు కృంగిపోకూడదని వసుధారలో ధైర్యం నింపుతుంది. మీ ప్రేమమిమ్మల్ని ఒక్కటి చేస్తుందని మహేంద్ర కూడా వసుధారతో అంటాడు.
ఇది నీ సామ్రాజ్యం…
తల్లితో కలిసి కాలేజీకి వస్తాడు శైలేంద్ర. కాలేజీని చూసి ఇది నీ సామ్రాజ్యం. ఇది నువ్వు ఎలాల్సిన సామ్రాజ్యం అని కొడుకుతో అంటుంది దేవయాని. ఇక్కడ ఉన్న సింహాసనం అదే ఎండీ సీట్‌లో నువ్వు కూర్చోవాలి అని కొడుకుతో అంటుంది దేవయాని. తప్పకుండా నీ కోరిక తీరుతుందని దేవయానితో అంటాడు శైలేంద్ర. సీట్‌లో ఎప్పుడు కూర్చుంటానా అని తాను ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు చెబుతాడు.
ఎప్పుడో ఎందుకు ఇప్పుడే ఎండీ సీట్‌లో కూర్చో అని కొడుకుతో అంటుంది దేవయాని. మనల్ని ఎవరు ఆపలేరని, ఆపడానికి రిషి కూడా లేడని కొడుకుతో దేవయాని చెబుతుంది. వసుధార అడ్డుపడుతుందేమోనని శైలేంద్ర అనుమానపడతాడు. ఆమె గురించి ఆలోచించొద్దని నీ పక్కన నేను ఉన్నానని చెబుతాడు.
ఎండీ క్యాబిన్‌లోకి శైలేంద్ర…
వసుధార ఎండీ క్యాబిన్‌లో లేదని తెలుసుకొని ఆ రూమ్‌కు వస్తారు శైలేంద్ర. డీబీఎస్‌టీ ఎండీ శైలేంద్రభూషణ్ అనే పేరు టేబుల్‌పై ఎప్పుడు ఉంటుందోనని శైలేంద్ర అంటాడు. ఎండీ సీట్ అయాస్కాంతంలా తనను లాగుతుందని చెబుతాడు.
మనల్ని ఎవర్రా ఆపేది…
ఎండీ సీట్‌లో కూర్చోవడానికి సిద్ధమవుతాడు శైలేంద్ర. మనల్ని ఎవర్రా ఆపేది అంటూ కొడుకును ప్రోత్సహిస్తుంది దేవయాని. అతడు సీట్‌లో కూర్చబోతుండగా వసుధార వచ్చి ఆపేస్తుంది. ఈ సీట్‌లో మీరు కూర్చోవద్దు. అది రిషి సీట్ అని వార్నింగ్ ఇస్తుంది. రిషి సీట్ అని దానిపై రాసి పెట్టి ఉందా అని వసుధారపై సెటైర్ వేస్తుంది దేవయాని. అది రిషి సీట్…రిజర్వ్ చేసి పెట్టాను.
అందులో కూర్చోవాలంటే అర్హత ఉండాలని అంటుంది. నా కొడుకు ఫారిన్‌లో చదువుకొని వచ్చాడు. అది చాలాదా అర్హత అంటూ దేవయాని ధీటుగా బదులిస్తుంది. ఒక పదవిలో కూర్చోవాలంటే డిగ్రీ ఉంటే సరిపోదు నాయకత్వ లక్షణాలు ఉండాలి. పదిమందిని కనుసైగతో నడిపించే దమ్ము ధైర్యం ఉండాలి. కనుసైగతో విద్యార్థులను చరిష్మా, కరిష్మా ఉండాలని అంటాడు.
వసుధార వార్నింగ్..
తాను పేషెంట్‌నని, రెండు నిమిషాలు కూర్చొని రిలాక్స్ అయి వెళ్లిపోతానని శైలేంద్ర అంటాడు. పేషెంట్ అయినా కూర్చోకూడదని, అవసరమైతే వీల్ ఛైర్ తెప్పిస్తానని, లేదంటే స్ట్రెచర్ తెప్పించి డైరెక్ట్‌గా హాస్పిటల్‌లో చేర్పిస్తానని శైలేంద్రను అవమానిస్తుంది వసుధార. ఎండీ సీట్‌పై శైలేంద్ర చేయి వేసి ఉండటం చూసిన వసుధార ఫైర్ అవుతుంది. ఆ చేయి తీయమని వార్నింగ్ ఇస్తుంది.
ఇది మా కాలేజీ అని దేవయాని అంటుంది. వాడు నా కొడుకు అని అంటుంది. మీ కొడుకు అయితే ఇంట్లో మర్యాదలు చేయండి. మీ పెత్తనాలు ఇంట్లో చూపించుకొండి. ఇక్కడ కాదు. ఇది కాలేజీ అని అంటుంది. నువ్వు ఎక్కువ చేస్తున్నావని వసుధారతో అంటుంది దేవయాని. మీ విషయంలో తక్కువ చేస్తున్నాను. ఇంకా చేయాల్సింది చాలా ఉందని ధీటుగా బదులిస్తుంది వసుధార.
శైలేంద్ర పనికిరాడు…
ముందు మీరు ఎండీ సీట్ నుంచి దూరంగా జరగండి అని చెబుతుంది. ఎండీ సీట్‌లో కూర్చోవడానికి శైలేంద్ర పనికిరాడని అంటుంది. ఆమె మాటలతో శైలేంద్ర హర్ట్ అవుతాడు. నువ్వు వేసే ప్రతి అడుగు నిన్ను ప్రమాదానికి దగ్గర చేస్తుందని గుర్తుపెట్టుకో బెదిరించబోతున్నాడు. ప్రమాదాలు నాకు కొత్తెం కాదు. నీ బెదిరింపులకు తాను భయపడనని, ఇక్కడ భయపడేవాళ్లు ఎవరు లేరని శైలేంద్రతో అంటుంది. మీరు ఇక్కడి నుంచి వెళ్లకపోతే మెడపట్టి బయటకు గెంటిస్తానని అంటుంది.
అటెండర్ భయం…
నువ్వు నా కొడుకును రెచ్చగొడుతున్నావని వసుధారతో అంటుంది దేవయాని. రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మీ కొడుకు ఏమైనా పశువా అంటూ శైలేంద్రను అవమానిస్తుంది. అక్కడే ఉన్న అటెండర్‌ను పిలిచి ఎవరు పడితే వాళ్లు ఎండీ క్యాబిన్‌లోకి వస్తే నువ్వు ఏం చేస్తున్నావని నిలదీస్తుంది.
ముందు వీళ్లను బయటకు పంపించమని అంటుంది. కానీ అటెండర్ భయపడతాడు. నీకు ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు. నేను హామీ ఇస్తున్నాని వసుధార అనడంతో అతడు ముందుకు వస్తాడు. దాంతో శైలేంద్ర భయపడిపోతాడు. అటెండర్‌ను ఆగమని తానే రూమ్ నుంచి బయటకు వెళతాడు