Best Web Hosting Provider In India 2024

Nizamabad VDC: నిజామాబాద్ జిల్లాలో వీడీసీలు చెలరేగిపోతున్నాయి. ఇటీవల మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వంత గ్రామంలో ఓ అణగారిన సామాజిక తరగతికి చెందిన వారి భూమిని కబ్జా చేసేందుకు యత్నించగా… తాజాగా మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామంలో పూర్తిగా ఒక కులాన్ని వీడీసీ వెలివేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు… వీడీసీకి చెందిన ఏడుగురు సభ్యులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.
మోర్తాడ్ మండం షట్పెల్లి గ్రామంలో ఒక స్థలంపై వీడీసీ కన్నుపడింది. ఆ స్థలాన్ని తమకు అప్పగించాలని యజమానుల్ని బెదిరించారు. దీంతో వారు అందుకు అంగీకరించలేదు. వీడీసీకి ఎదురుచెబుతారా అంటూ మొత్తంగా ఓ కుల సంఘాన్ని బహిష్కరించారు.
ఆ కులానికి చెందిన వారితో గ్రామంలో ఎవరూ మాట్లాడొద్దని, వారికి ఎవరూ పని కల్పించొద్దని ఆదేశించారు. పైగా వ్యవసాయ పనులకు పిలవొద్దని, నిత్యవసరాలు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఏడుగురిని అరెస్టు చేశారు. చట్టానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తే వారిని ఉపేక్షించలేదని నిజామాబాద్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ జయరాం స్పష్టం చేశారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది.
నిజామాబాద్ జిల్లాలో వీడీసీ(విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ)ల సమస్య దశాబ్దాలుగా ఉంది. వీడీసీని అడ్డుపెట్టుకుని వెనుకబడిన, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకోవడం ఆనవాయితీగా మారింది.
వీడీసీలు పల్లెల్లో సమాంతర పాలన నడిపిస్తోన్నా… చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయన్న విమర్శలు లేకపోలేదు. కుటుంబాలను, కులాలను సామాజిక బహిష్కరణ చేస్తూ నేటికీ `వెలి`ని బహిరంగంగా అమలు చేస్తున్నాయి. ప
దేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఫిర్యాదులు వచ్చినా .. ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదని కొందరు ఆరోపిస్తు్న్నారు. పైగా వీడీసీలను అడ్డుపెట్టుకుని తమ రాజకీయ పెత్తనం కొనసాగించారన్న ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీడీసీలపై కొత్త ప్రభుత్వమైనా చర్యలు తీసుకుంటుందని సామాజిక వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
(మీసా భాస్కర్, నిజామాబాద్)