Best Web Hosting Provider In India 2024

Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ఫ్యామిలీ స్టార్ కోసం అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్నాడు. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు అక్కడి అభిమానులను కలిసి వాళ్లతో మాట్లాడుతున్నాడు. కొన్ని రోజులుగా ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు
తాజాగా న్యూయార్క్ లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను కలిసి వీడియో కూడా బయటకు వచ్చింది. అంతేకాదు అతని ఫ్యామిలీ స్టార్ మూవీ గ్లింప్స్ కూడా టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ఫిమేల్ లీడ్ గా కనిపించనుండగా.. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సంక్రాంతి రేసులో ఉండాల్సిన ఈ మూవీ.. ఇప్పుడు వాయిదా పడింది.
ఫ్యామిలీ స్టార్ షూటింగ్ లో గ్యాప్ దొరికిన సమయంలో అక్కడున్న అభిమానులతో ప్రత్యేకంగా ఓ మీటింగ్ ఏర్పాటు చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్బంగా వాళ్లతో సెల్ఫీలు దిగాడు. తన సినిమాల గురించి ముచ్చటించాడు. న్యూయార్క్ లోని ఐకానిక్ లొకేషన్ టైమ్స్ స్క్వేర్ లోని బిల్ బోర్డులపై తన మూవీ గ్లింప్స్ ప్లే చేయడంపై విజయ్ చాలా సంతోషంగా కనిపించాడు.
మంగళవారం (డిసెంబర్ 19)తో యూఎస్ఏలో ఫ్యామిలీ స్టార్ షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత ఇండియాలో మరో 15 రోజుల షెడ్యూల్ తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని గతంలో ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పాడు. ఇప్పుడీ మూవీని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషీ వరుస ఫ్లాపులతో ఢీలా పడిన విజయ్.. ఈ ఫ్యామిలీ స్టార్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఖుషీ మూవీ మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవడంతో సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. దీంతో తనకు హిట్ అందించిన పరశురామ్ తో ఇప్పుడీ ఫ్యామిలీ స్టార్ చేస్తున్నాడు. తర్వాత గౌతమ్ తిన్నూరితోనూ మరో సినిమా చేయనున్నాడు.