Best Web Hosting Provider In India 2024

Vijayawada West Mla:విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో ప్రచారం జరిగినట్టే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మార్పు ఖాయమైంది. మాజీ మంత్రి స్థానంలో పశ్చిమ నియోజక వర్గం నుంచి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..
ట్రెండింగ్ వార్తలు
విజయవాడ పశ్చిమలో అభ్యర్థి మార్పు అనివార్యమైతే తాను సిఫార్సు చేసిన వారికి టిక్కెట్ ఇవ్వాలని వెల్లంపల్లి మొదటి నుంచి కోరుతున్నారు. అయితే వెల్లంపల్లి అభ్యర్థనను కూడా పార్టీ పక్కన పెట్టింది. వెల్లంపల్లి ఆశీస్సులతో టిక్కెట్ ఆశీస్తున్న మేయర్ రాయన భాగ్యలక్ష్మీకి కూడా అవకాశం లేదని తెలుస్తోంది.
విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి నిమ్రా విద్యా సంస్థల యజమాని రసూల్ ఖాన్‌ను అభ్యర్థిగా దింపాలని వైసీపీ భావిస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో బలమైన ఓటు బ్యాంకుగా మైనార్టీలు ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమి తరపున నగరాల సామాజిక వర్గాన్ని పోటీకి దింపితే.. అందుకు మైనార్టీ అభ్యర్థిని పోటీ చేయించడమే మేలని వైసీపీ భావించింది. 2014లో వైసీపీ తరపున జలీల్ ఖాన్ ఈ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఆ తర్వాత కూడా మైనార్టీలు వైసీపీకి అండగా నిలిచారు.
రాజకీయాల్లో పాత వారు, ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికంటే క్లీన్ ఇమేజ్‌తో ఉన్న వారు, పూర్తిగా కొత్త ముఖాలతో పోటీ చేయించడం ద్వారా సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత నుంచి తప్పించుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి మీద పలు సర్వేల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమైనట్టు పలు సర్వేల్లో స్పష్టమైంది. దాదాపు ఏడాది క్రితమే వెల్లంపల్లి పశ్చిమ అభ్యర్థిగా మేయర్ రాయన భాగ్యలక్ష్మీ పేరును తెరపైకి తెచ్చారు.
గత కొద్ది నెలలుగా ఐపాక్ సర్వేల్లో ప్రస్తుత నాయకులపై వ్యతిరేక ఫలితాలు రావడాన్ని గుర్తించిన వైసీపీ పెద్దలు సమర్ధులైన వారి కోసం గాలించారు.విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉండటంతో పాటు ఆర్ధికంగా సమర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ శివార్లలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను నిర్వహిస్తున్న నిమ్రా విద్యా సంస్థల యజమానిని పశ్చిమ నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నియోజక