Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari december 19th: మురారి శుక్రవారం లోపు కేసు తేల్చేస్తే ఏంటి తన పరిస్థితని ముకుంద టెన్షన్ పడుతూ ఉంటుంది. అటుగా వచ్చిన భవానీ తనని చూసి ఏమైందని అడుగుతుంది. మురారికి గతం గుర్తుకు వచ్చింది నా భవిష్యత్ అంధకారం చేస్తాడేమోనని భయంగా ఉందని చెప్తుంది.
ట్రెండింగ్ వార్తలు
ఎందుకు భయం ముందు ఆ కేసు తేలాలి కదా అయినా నువ్వు ఏదో తప్పు చేసినట్టు ఎందుకు భయపడుతున్నావ్. తప్పు చేసిన వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారు కదా అది వాడే తెలుసుకుంటాడని అంటుంది. ఒకవేళ పెళ్లి లోపు కేసు తేలకపోతే పెళ్లి తర్వాత కృష్ణ తప్పు చేయలేదని తెలిస్తే ఏంటని అంటుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటున్న రోజులివి తప్పు చేయకుండా ఎవరైనా జైలుకి వెళ్తారా? అయినా నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదని భవానీ అడుగుతుంది. ముకుంద అదేమీ లేదని కవర్ చేస్తుంది.
సీసీటీవీ ఫుటేజ్ మిస్
ముకుంద, మురారి పెళ్లి చేసి పంపించాలని అనుకుంటుంటే జరగడం లేదు. కృష్ణని పంపించాలని అనుకున్నాను అదీ జరగలేదు. మురారిని అమెరికా పంపించాలని అనుకున్నాను అదీ జరగలేదు. పెళ్లి చేయాలని అనుకుంటే మురారికి గతం గుర్తుకు వచ్చింది. అన్నీ కృష్ణకె అనుకూలంగా జరుగుతున్నాయి ఎందుకో అర్థం కావడం లేదని భవానీ ఆలోచిస్తుంది. మురారి, కృష్ణ హాస్పిటల్ కి వచ్చి పరిమళని కలుస్తారు. కృష్ణ భవానీ పెట్టిన కండిషన్ గురించి పరిమళకి చెప్తుంది.
నాకు ఇక్కడే కదా సర్జరీ జరిగింది. నన్ను ఎవరు ఇక్కడ జాయిన్ చేశారని మురారి అడుగుతాడు. డీటైల్స్ ఉన్నాయని పరిమళ చెప్తుంది. నిన్ను తీసుకొచ్చిన వ్యక్తి పేరు శేఖర్ అని చెప్తుంది. అతను ఎవరని కృష్ణ అడుగుతుంది. అదేంటి అతను ఎవరో మీకు తెలియదా? మీకు తెలియకపోతే సర్జరీ ఎందుకు చేయించాడని అంటుంది. సర్జరీ చేయించిన వ్యక్తి డీటైల్స్ చెక్ చేస్తుంది కానీ ఏ వివరాలు దొరకవు. డబ్బు గురించి ఆలోచించవద్దని యాటిట్యూడ్ చూపించాడని పరిమళ చెప్తుంది. సీసీటీవీ ఫుటేజ్ గురించి మురారి ఆరా తీస్తాడు.
ముకుందకి నగలు సెలెక్ట్ చేసిన రేవతి
యాక్సిడెంట్ జరిగిన రోజుకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మిస్ అయ్యిందని పరిమళ చెప్తుంది. పక్కాగా పథకం ప్రకారమే తనకి సర్జరీ చేశారని మురారి అనుమానపడతాడు. పరిమళ తన స్టాఫ్ ని పిలిచి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మిస్ అయ్యిందని అడుగుతుంది. సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందని చెప్తాడు. కేసుకి సంబంధించి ఏదైనా క్లూ దొరికిందో లేదోనని రేవతి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నగలు చూపించడానికి సేటు ఇంటికి వస్తాడు. అతన్ని చూసి ముకుంద సంతోషపడుతుంది. భవానీని పిలుస్తుంది. నగలు సెలెక్ట్ చేసుకోమని ముకుందకి చెప్తుంది.
ముకుంద సెలెక్ట్ చేసుకున్న నగలు తనకి నచ్చలేదని రేవతి అంటుంది. అయితే నువ్వే సెలెక్ట్ చేయమని భవానీ రేవతికి చెప్తుంది. తాళి బొట్టు సెలెక్ట్ చేస్తుంది. తనకి నచ్చకపోయిన అత్తయ్య సెలెక్ట్ చేసింది కాబట్టి తీసుకుంటాను. అది మెడలో వేసుకున్న ప్రతి సారి ఆమెకి తనే సెలెక్ట్ చేసినట్టు గుర్తుకు వస్తుందని ముకుంద అనుకుంటుంది. రేవతి శకుంతల దగ్గరకి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తను ఏడవడం చూసి శకుంతల కంగారుపడుతుంది. తన చేతగానితనం చెప్పుకుని రేవతి బాధపడుతుంది.
భవానీ మీద అనుమానపడిన శకుంతల
ఏమైంది ఇప్పుడు బిడ్డలు పోయారు కదా నిజం తెలుస్తుందని శకుంతల సర్ది చెప్పడానికి చూస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా మధుకర్ వస్తాడు. నా పెనిమిటి నేరం చేయలేదని భవానీ వదినకి కూడా తెలుసు. కానీ తనకి ముకుంద అంటే ఇష్టం అందుకే పెళ్లి చేయాలని అనుకుంటుందని శకుంతల అంటుంది. నేరం చేసిన వాడు దొరికే దాకా కదా ఇది. దోషి దొరికితే అప్పుడు పెళ్లి ఎలా చేస్తుందని లాజిక్ గా మాట్లాడుతుంది. తన మాటలు నిజమేనని రేవతి కూడా నమ్ముతుంది.
మురారి వాళ్ళు కమిషనర్ ని కలవడానికి వస్తారు. తాను చనిపోయానని ఎవరో అనాథ శవాన్ని తీసుకురావలసిన అవసరం ఎవరికి ఉందో కనుక్కోవాలని అనుకుంటున్నట్టు చెప్తాడు. డ్యూటీలో జాయిన్ అవుతానని మురారి అడుగుతాడు. కానీ కమిషనర్ మాత్రం రెండు నెలలు పాటు అందుబాటులో లేకుండా ఇప్పుడు రూపం మార్చుకుని వస్తే కాస్త కష్టం అవుతుందని అంటాడు.