Best Web Hosting Provider In India 2024

Siddaramaiah Vs KTR : కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సామాజిక మాధ్యమం ఎక్స్ లో వార్ నడుస్తోంది. సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడిన ఓ వీడియోను ఎక్స్ లో రీపోస్టు చేసిన కేటీఆర్ విమర్శలు చేశారు. దీనికి సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. వైరల్ అవుతువున్న తన వీడియో ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తూ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.
ట్రెండింగ్ వార్తలు
సిద్ధరామయ్య కౌంటర్
తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు ఓటమిపాలైందో మీకు తెలుసా? ఎందుకంటే మీరు ఫేక్ వీడియో ఏదో, ఎడిటెడ్ వీడియో ఏదో తెలుసుకోలేకపోతున్నారని కేటీఆర్ ను ఉద్దేశించి సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. బీజేపీ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తుంటే, బీఆర్ఎస్ వాటిని ప్రచారంలోకి తెస్తుందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి నిజమైన బీ టీమ్ అంటూ సిద్ధరామయ్య విమర్శలు చేశారు.
కేటీఆర్ ట్వీట్
“ఎన్నికల్లో ఓట్ల కోసం ఏదో అన్నాం అనుకోండి, అది ఇస్తాం ఇది ఇస్తాం అంటాం, అంత మాత్రాన అన్నీ ఫ్రీ గా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది, అయితే డబ్బులు లేవు” అని కర్ణాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎక్స్ లో రీపోస్టు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు అయ్యాక ఇదే ప్రకటన రేవంత్ రెడ్డి కూడా చేస్తారా? అంటూ సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణకు కూడా భవిష్యత్తు లేకుండా చేశారన్నారు. విపరీతమైన ప్రకటనలు చేసే ముందు ప్రాథమిక పరిశోధన, ప్రణాళికను చేయకూడదా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
సిద్ధరామయ్యకు కేటీఆర్ కౌంటర్
“మీ పార్టీ బూటకపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను సిగ్గులేకుండా మోసం చేసినందుకే మేము ఎన్నికల్లో ఓడిపోయాం. డిసెంబర్ 9, 2023 గడిచిపోయింది, కానీరైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు రైతు భరోసా హామీ ఏది? రూ. 2 లక్షల వ్యవసాయ రుణమాఫీ? రూ.4000 సంక్షేమ పెన్షన్? రూ.500 గ్యాస్ సిలిండర్?ప్రతి మహిళకు రూ.2500 హామీ ఏమైంది? తొలి మంత్రివర్గంలో మెగా డీఎస్సీ ప్రకటన? మొదటి కేబినెట్‌లో 6 హామీలకు చట్టపరమైన భద్రత? ఏమయ్యాయి” అని కేటీఆర్ సిద్ధరామయ్యకు కౌంటర్ ఇచ్చారు. ఈ హామీలు బూటకమా లేక ఈ పథకాలు వాగ్దానం చేసిన మీ పార్టీ నాయకులు బూటకమా? మరో మూడు రాష్ట్రాల ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో వివరించండి? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.