Munagaku Curry: మునగాకులతో ఇలా కూర చేయండి, రుచి అదిరిపోతుంది

Best Web Hosting Provider In India 2024

Munagaku Curry: ఆరోగ్యానికి మునగాకు ఎంతో మంచిది. కానీ దానితో ఏం వండుకోవాలో చాలా మందికి తెలియదు. మునగాకు రెసిపీలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడే మేము మునగాకు కర్రీ ఎలా వండాలో చెబుతున్నాము. దీన్ని వండడం చాలా సులువు. రుచి కూడా అదిరిపోతుంది. మునగాకులు తినడం చాలా అవసరం. మునగాకుతో వండిన ఆహారాలు తినడం వల్ల వాత, పిత్త దోషాలు పోతాయి. కంటి సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి. మహిళలు మునగాకులను తినడం వల్ల పీరయడ్స్ సమస్యలు రాకుండా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయాలంటే వారానికి రెండు సార్ల మునగాకు రెసిపీలను వండుకుని తినాలి.

 

ట్రెండింగ్ వార్తలు

మునగాకు కర్రీ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు

మునగాకులు – మూడు కప్పులు

పచ్చి కొబ్బరి తురుము – మూడు స్పూన్లు

మినప పప్పు – పావు కప్పు

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – రెండు స్పూన్లు

పసుపు – అర స్పూను

ఎండు మిర్చి – ఆరు

ఆవాలు – ఒక స్పూను

మునగాకు కర్రీ రెసిపీ

1. మినపపప్పును నీళ్లలో అరగంట ముందే నానబెట్టాలి.

2. మునగాకును సన్నగా తరగాలి. నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఆవాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి.

4. తరువాత తరిగిన మునగాకును వేసి బాగా కలపాలి.

5. నానబెట్టిన మినపపప్పును కూడా వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కలపాలి.

6. పావు గ్లాసు నీటిని కూడా వేసి, స్టవ్ ను చిన్న మంట మీద పెట్టాలి.

7. మూత పెట్టి పావుగంట సేపు ఉడికించాలి. నీళ్లు ఇంకే వరకు వేయించాలి. అందులో కొబ్బరి తురుమును కూడా వేయాలి.

8. అయిదు నిమిషాల పాటూ ఉడికించాక స్టవ్ కట్టేయాలి.

9. దీన్ని చపాతీలతో, అన్నంతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది.

మునగాకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటివి రాకుండా ఉంటాయి. మునగాకులో యాంటీ ఇన్ఫ్ల మేటరీ గుణాలు ఎక్కువ. అలాగే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టిరియల్ గుణాల వల్ల దగ్గు, ఆస్తమా వంటివి రాకుండా ఉంటాయి. మధుమేహం ఉన్న వారు మునగాకులను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో క్లోరోజెనిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. మునగాకు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బాలింతలు తరచూ మునగాకుల వంటలు తింటే వారిలో పాలు పడతాయి. ఆ పాలల్లో ఐరన్, విటమిన్లు, కాల్షియం, అధికంగా ఉంటాయి. అవన్నీ శిశువులకు అందుతాయి.

 
WhatsApp channel
 

టాపిక్

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *