Best Web Hosting Provider In India 2024

Salaar Second Song: ప్రస్తుతం ‘సలార్’ సినిమా మేనియా ఫుల్ రేంజ్‍లో ఉంది. సోమవారం ఈ మూవీ నుంచి రిలీజ్ ట్రైలర్ రాగా.. అదిరే రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సీక్వెన్సులతో థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలే అన్న రేంజ్‍లో ట్రైలర్ ఉంది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ మరో మూడు రోజుల్లో అంటే డిసెంబర్ 22న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే రెండు ట్రైలర్లు, ఓ పాటను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో సాంగ్ కూడా రెడీ అయింది.
ట్రెండింగ్ వార్తలు
సలార్ సినిమా నుంచి రెండో పాటను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ సిద్దమైందని తెలుస్తోంది. రేపు (డిసెంబర్ 20) ఈ రెండో సాంగ్ రానుందని సమాచారం వెల్లడైంది. దీంతో సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఈ సాంగ్ వస్తున్నట్టువుతుంది. అయితే, ఈ పాట స్పెషల్ సాంగ్ అనే రూమర్స్ కూడా ఉన్నాయి.
సలార్ నుంచి ఇటీవల వచ్చిన ఫస్ట్ సాంగ్ బాగా పాపులర్ అయింది. ‘సూరీడే’ అంటూ సాగిన ఈ పాట ఎమోషనల్‍గా ఫ్రెండ్‍షిప్‍ను చాటేలా ఉంది. దేవ (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య స్నేహాన్ని చాటేలా ఈ తొలి పాట ఉంది. మరి రెండో సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. సలార్ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు.
సలార్ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. తన మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రంగానే సలార్‌ను తెరకెక్కించారు. సినిమా ప్రమోషన్లను మూవీ యూనిట్ పెద్దగా చేయకపోయినా క్రేజ్ మాత్రం వేరే లెవెల్‍లో ఉంది. చాలా బాక్సాఫీస్ రికార్డులను సలార్ బద్దలుకొట్టడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా రెండో ట్రైలర్ తర్వాత ఈ మూవీ అంచనాలు ఆకాశాన్ని చేరాయి.
సలార్ చిత్రంలో ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించగా.. శృతి హాసన్ హీరోయిన్‍గా చేశారు. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, బాబి సింహా, శ్రీయా రెడ్డి కీలకపాత్రలు పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 22న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లోనూ సలార్ రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం