Teja Sajja: ఆ హీరోలను ఈ ప్రశ్న అడగగలరా?: హనుమాన్ హీరో తేజ

Best Web Hosting Provider In India 2024

తేజ సజ్జా

Teja Sajja: యంగ్ స్టార్ తేజ సజ్జా హీరోగా నటించిన సూపర్ హీరో మూవీ హనుమాన్ (హను-మ్యాన్) ట్రైలర్ రిలీజ్ అయింది. నేడు (డిసెంబర్ 19) వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. విజువల్ ఫీస్ట్‌లా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాన్ వరల్డ్ రేంజ్‍లో తెలుగు సహా మొత్తంగా 11 భాషల్లో హనుమాన్ చిత్రం 2024 జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, ట్రైలర్ రిలీజ్ కోసం మూవీ యూనిట్ నేడు ఈవెంట్ నిర్వహించింది.

ట్రెండింగ్ వార్తలు

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‍లో హీరో తేజ సజ్జాకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే, తన మార్కెట్ కన్నా.. హనుమాన్ బడ్జెట్ ఎక్కువగా ఉంది కదా, ఈ సినిమాకు సరిపోతారా అనే ప్రశ్న తేజకు ఎదురైంది. అంటే తేజకు అంత రేంజ్ లేదనే అర్థంతో ఆ ప్రశ్న ఉంది. దీంతో తేజ కాస్త స్ట్రాంగ్‍గానే బదులు ఇచ్చారు. ఇంతకు ముందే నటులు ఉండే ఫ్యామిలీ నుంచి వచ్చే రెండో జనరేషన్ యాక్టర్లు (హీరోలు) ప్రారంభంలోనే పెద్ద సినిమాలు చేసినా ఎవరూ ఈ ప్రశ్న అడగడం లేదని తేజ అన్నారు. వాళ్లని ఈ ప్రశ్న అడగలరా అని అన్నారు. తాను ఇప్పటికే కొన్ని సినిమాలు చేశానని తేజా సజ్జా గుర్తు చేశారు.

“నేను చాలా విధేయతతో చెబుతున్నా. ఎవరైనా సెకండ్ జనరేషన్ యాక్టర్స్ వస్తే.. వాళ్ల ఫస్ట్ సినిమాలకు ఇంతకంటే పెద్దగా చేసినా.. మీరెవరూ ఈ క్వశ్చన్ అడగడం లేదు. చిన్నప్పటి నుంచి ఇక్కడ సినిమాలు చేసి.. పెద్దయ్యాక మళ్లీ ఓ బేబీ సహా మరిన్ని సినిమాలు చేసి వచ్చా. కిందా మీదా పడి కష్టపడుతున్నా. ఇక్కడ బతకాలని కష్టపడి సినిమా చేస్తే.. సరిపోతారా అంటే చిన్నచూపు చూసినట్టు అనిపిస్తోంది” అని తేజ గట్టిగా బదులు ఇచ్చారు.

“నేను ఎవరితోనూ పోల్చుకోవడం లేదు. వాళ్లకు అవకాశం వచ్చింది. నాకు హనుమాన్‍ అనే ఛాన్స్ వచ్చింది. సినిమా నాకు ఏమి ఇచ్చింది అనేది అందరికీ కనిపిస్తోంది. సినిమాకు నేనేమిచ్చానో నాకు, డైరెక్టర్‌కు కనిపిస్తోంది. నేను సినిమాలకు 100 శాతం కష్టపడ్డా. అందువల్లే నాకు హనుమాన్ వచ్చిందేమో. ఈ సినిమా అయిపోయింది.. నా దగ్గరి నుంచి ఎవరూ లాక్కోలేరు” అని తేజ సజ్జా అన్నారు.

హనుమాన్ సినిమా ట్రైలర్ అన్ని అంశాల్లోనూ అత్యుత్తమంగా ఉంది. హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొందిన ఓ యువకుడు (తేజ సజ్జా).. విలన్ల నుంచి తన ప్రాంతాన్ని ఎలా కాపాడుకున్నాడనేదే హనుమాన్ కథగా తెలుస్తోంది. హనుమాన్ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ హీరోయిన్‍గా చేయగా.. రాధిక శరత్‍కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి నిర్మించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *