Krishna mukunda murari december 21st: రంగంలోకి దిగిన దేవ్.. భవానీని తప్పుదారి పట్టించిన ముకుంద

Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari december 21st: తన మీద అనుమానం రాకుండా ఉండటం కోసం దేవ్ మురారి ముందుకు రావాలని డిసైడ్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

కృష్ణ ముకుంద మురారి డిసెంబర్ 21 ఎపిసోడ్

Krishna mukunda murari december 21st: సంక్రాంతి పండుగకి మీ చిన్నాన్న వస్తాడా? అని శకుంతల బాధగా కృష్ణని అడుగుతుంది. తప్పకుండా వస్తాడని ధైర్యం చెప్తుంది. చిన్నాన్న వస్తే ఊరికి వెళ్ళి పండగ చేసుకోవచ్చని అంటుంది. అలాగే వెళ్దాములే అని చెప్తుంది. మురారి కృష్ణ దగ్గరకి వచ్చి బట్టలు సర్దుకో ఇంటికి వెళ్దామని అంటాడు. కానీ కృష్ణ మాత్రం ఎందుకని అడుగుతుంది. మీ పెద్దమ్మ లగ్గం క్యాన్సిల్ చేసిందా అని శకుంతల అంటే లేదని చెప్తాడు. మీకు ముందే చెప్పాను కదా ముకుంద ఆదర్శ్ కలిసేవరకు ఆ ఇంటికి రానని అంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు

ఇంటికి రానని చెప్పిన కృష్ణ

ఏంటి ముకుంద తను నీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించదని మురారి అంటే నేను వస్తే ఆలోచిస్తుంది మీకు తెలియదు. ఇప్పుడు నేను ఆక్కడికి వస్తే ఏదో ఒకటి పెద్దత్తయ్యకి చెప్తే మన ఇద్దరి మధ్య దూరం వస్తుంది. మా చిన్నమ్మ చెప్పిందని, పెద్దత్తయ్య రమ్మందని చెప్పి నా జీవితాన్ని నాశనం చేసుకోలేనని కృష్ణ తెగేసి చెప్తుంది. మురారి మాత్రం ముకుంద ఏం చెప్పిన పెద్దమ్మ నమ్మదని అంటాడు. కానీ ముకుంద ఏం చెప్పినా పిచ్చిగా చెప్పినా పెద్దత్తయ్య నమ్మేస్థితిలో ఉంది. మీకు తెలియంది ఏమి కాదు కదా. తన మాట వినమని అర్థం అయ్యేలా చెప్తుంది.

సరే శేఖర్ తో పాటు ఆదర్శ్ ని కూడా వెతుకుదామని మాట ఇస్తాడు. మళ్ళీ కృష్ణకి ముద్దు పెట్టేయడంతో తెగ సిగ్గుపడిపోతుంది. ముకుంద, భవానీ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రేవతి వస్తుంది. కృష్ణని తీసుకొస్తానని మురారి వెళ్ళాడు.. తను ఇంటికి వస్తే ఏం జరుతుందోనని కంగారుపడుతుంది. మురారి చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి? కేసు తేలే వరకు దూరంగా ఉంటామని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నాడు. కృష్ణ మన కిచెన్ లో అడుగుపెట్టనని బిల్డప్ ఇచ్చింది కదా ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని వస్తుందని భవానీ అంటుంది. చిన్న పిల్లలు కదా మనమే పెద్ద మనసు చేసుకోవాలని రేవతి సర్ది చెప్పడానికి చూస్తుంది కానీ భవానీ వినదు.

 

కృష్ణని తప్పుగా అర్థం చేసుకుంటున్న భవానీ

ఈ కేసు వెనుక ఉంది పెద్దపల్లి ప్రభాకర్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యారని అర్థం కదా. నీకొడుకు శుక్రవారం కృష్ణ వంట చేస్తుందని ఛాలెంజ్ చేశాడు కదా ఏమయ్యాయి అవన్నీ అని నిలదీస్తుంది. అప్పుడే మురారి వస్తే కృష్ణ ఎక్కడని అడుగుతుంది. కృష్ణ నా భార్య కావడం నిజంగా నా అదృష్టం. నా కళ్ళు తెరిపించింది. ముకుంద జీవితం ఒక దారి చేసేవరకు రానని కృష్ణ చెప్పింది. అందుకే ఈ కేసు తేలే వరకు ఏం మాట్లాడొద్దని చెప్పి పంపించిందని చెప్తాడు. ముకుంద జీవితం సరి చేయడానికి తను ఎవరు? ముకుంద జీవితం ఎలా ఉండాలో నాకు తెలుసు. మీరెవరు ఆలోచించాల్సిన అవసరం లేదని భవానీ కోపంగా వెళ్ళిపోతుంది.

ఇంటికి వచ్చిన అల్లుడిని యఎందుకు వెనక్కి పంపించావని శకుంతల అడుగుతుంది. అప్పుడే రేవతి కూడా వచ్చి ఎందుకు ఇలా చేశావని అంటుంది. నేను ఏదైనా ఆలోచించి చేస్తానని తెలుసు కదా. ఏసీపీ సర్ కి గతం గుర్తుకు వస్తుందని చెప్పాను కదా అదే జరిగింది. ఇప్పుడు కూడా ముకుంద జీవితం సెట్ చేసి ఇంట్లో అడుగుపెడతానని మళ్ళీ చెప్తుంది. కృష్ణ మాటలకి రేవతి కన్వీన్స్ అవుతుంది. నేను రాను అంటే పెద్దత్తయ్య ఏమన్నారని కృష్ణ అడుగుతుంది. ఏం అంటుంది మౌనంగా వెళ్లిపోయిందని చెప్తుంది. ఆదర్శ్ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఈలోపు శేఖర్ పట్టుబడితే ఆన్ని సమస్యలు తీరిపోతాయని కృష్ణ అంటుంది.

 

ముకుందకి హామీ ఇచ్చిన దేవ్

శ్రీనివాస్ ఇంట్లో దేవ్ ఉండగా ఎవరో డోర్ కొడతారు. టెన్షన్ పడిన దేవ్ గన్ తీసి మురారి ఇంకెవరూ వచ్చిన వాళ్ళని షూట్ చేస్తానని అనుకుంటాడు. వెళ్ళి తలుపు తీయగా ఎదురుగా ముకుంద ఉంటుంది. చెల్లిని చూసి రిలీఫ్ అవుతాడు. నాన్న ఎక్కడని అడుగుతుంది. మన ఊరు పంపించేశాను. అసలు వాడు మన నాన్నయేనా? ఏరోజైన పిల్లల గురించి ఆలోచించాడా అంటాడు. నాన్నని ఏమి అనొద్దని అంటుంది. రేపు మీ ఇంటికి వస్తానని దేవ్ చెప్పేసరికి ముకుంద కంగారుగా వద్దని చెప్తుంది. ఏం కాదు మురారి షాక్ లో ఉన్నప్పుడే నన్ను చూసినట్టు గుర్తు. నన్ను గుర్తు పట్టే అవకాశమే లేదని దేవ్ ధైర్యంగా చెప్తాడు.

వద్దు నాకు భయమేస్తుందని అంటుంది. సరే ఒక్కదానివే పోరాడి మురారిని పెళ్లి చేసుకుంటావా? అంటే మౌనంగా ఉంటుంది. అందుకే నేను వచ్చి చక్రం తిప్పుతానని చెప్తాడు. దేవ్ నిజంగా మా పెళ్లి అవుతుందా అని డౌట్ గా అడుగుతుంది. వచ్చే శుక్రవారం నీ పెళ్లి అని ధైర్యం చెప్పి పంపించేస్తాడు. కృష్ణ ఇంటి బయట కూర్చుని ఉండగా ముకుంద ఎవరూ చూడటం లేదు కదా అనుకుని దొంగ చాటుగా ఇంట్లోకి వెళ్తుంది. ఏదో తేడా కొడుతుందని కృష్ణ అనుకుంటుంది. ఈ టైమ్ లో ముకుంద ఎక్కడికి వెళ్ళి వస్తుందా అని అనుమానపడుతుంది.

 

ముకుందని నిలదీసిన భవానీ

ఇంట్లోకి మెల్లగా వెళ్తుంటే భవానీ ఆగు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అడుగుతుంది. నాన్నని కలిసి వస్తున్నానని చెప్తుంది. అనుక్షణం నీ గురించే ఆలోచిస్తున్నా ఇలాంటి టైమ్ లో నువ్వు కనిపించకపోతే ఎంత కంగారుపడతానని భవానీ అంటుంది. నా గురించి ఆలోచించడానికి మీరు ఉన్నారు ఇంకెప్పుడు మీకు చెప్పకుండా వెళ్లనని ముకుంద సంతోషంగా చెప్తుంది. కృష్ణ నిద్రలేచి తలుపు తెరిచేసరికి ఎదురుగా మురారి ఉంటాడు. తనతో పాటు ఫ్యామిలీ మొత్తం వెనుకే ఉంటుంది. వాళ్ళని చూసి కృష్ణ సంతోషపడుతుంది.

మురారితో పెళ్లి అవుతుందనే నమ్మకం తగ్గిపోతుంది. భవానీ అత్తయ్య తప్ప ఎవరూ హెల్ప్ చేయడం లేదు. మురారి కేసు బయట పెడితే అత్తయ్య కూడా దూరం అయిపోతుంది. ఒంటరిగా మిగిలిపోతాను.. ఇలా ఒంటరిగా మిగిలిపోవడమే నా భవిష్యత్ అవుతుందేమో అని భయపడుతుంది. ఇంట్లో వాళ్ళంతా కృష్ణ దగ్గరకి వెళ్లారని చెప్పి సెంటిమెంట్ తో కొట్టాలని అనుకుంటుంది. ఇంట్లో వాళ్ళంతా ఎక్కడని భవానీ అడుగుతుంది. ముకుంద కావాలని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

చాడీలు చెప్పి భవానీని నమ్మిస్తున్న ముకుంద

ఇప్పటి వరకు మౌనంతో వేరుగా చూస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్ గా వేరు చేసి అందరూ కృష్ణ దగ్గరకి వెళ్లారు. మీరొక్కరే నా జీవితం గురించి ఆలోచిస్తున్నారు. ఆ రోజు నేను చావకుండా కృష్ణ ఎందుకు ఆపిందో ఇప్పుడు అర్థం అవుతుంది. క్షణక్షణం చనిపొమ్మని ఇలా చేస్తుందని బాధపడుతుంది. ఇంట్లో వాళ్ళు నావైపు చాలా నీచంగా చూస్తున్నారు. నేను ఏదో కాని పని చేస్తున్నట్టు చూస్తున్నారు. ఈ కేసులు అసలు దోషులని పట్టుకోవడం నాకు వద్దు నాకు కావలసింది మురారితో జీవితం పంచుకోవడమేనని చెప్తుంది.

 
WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *