Best Web Hosting Provider In India 2024

Salaar Theatres: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా మూవీ ‘సలార్’ డిసెంబర్ 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ ఉంది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ మూవీ సలార్ కంటే ఒక్క రోజు ముందు డిసెంబర్ 21న థియేటర్లలోకి రానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ సినిమాల క్లాష్ నెలకొంది. అయితే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్దేశ్యపూర్వకంగానే సలార్ మూవీకి థియేటర్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో సలార్ మూవీ టీమ్ భారీ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.
ట్రెండింగ్ వార్తలు
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో సలార్ చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని మూవీ యూనిట్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిలో డంకీతో పాటు సలార్‌కు కూడా పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్‍ల్లో న్యాయబద్ధంగా స్క్రీన్లు కేటాయించేంత వరకు.. దక్షిణాదిలో ఆ థియేటర్లలో సలార్ స్క్రీనింగ్‍కు అనుమతించకూడదని డిసైడ్ చేసుకున్నారు మేకర్స్. దీంతో దక్షిణాదిలో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ థియేటర్లలో సలార్ రిలీజ్ కావడం ఇప్పటికైతే కష్టంగానే కనిపిస్తోంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ యాజమాన్యాలు పూర్తిగా సలార్‌ను విస్మరించి డంకీకే స్క్రీన్లు ఇస్తున్నాయని, దీని ద్వారా సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లను కూడా మభ్యపెడుతున్నాయని సలార్ టీమ్ ఆరోపిస్తోంది.
ఉత్తరాదిలో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ యాజమాన్యాలు సలార్‌కు న్యాయబద్దంగా స్క్రీన్లు ఇచ్చే వరకు.. దక్షిణాదిలో ఆ థియేటర్లలో మూవీని రిలీజ్ చేయకూడదని తీసుకున్న నిర్ణయంలో నిర్మాతలు వెనక్కి తగ్గే పరిస్థితి లేదని తెలుస్తోంది. సలార్ టీమ్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ దిగొస్తాయేమో చూడాలి.
ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు సలార్ చిత్రంపై ఫుల్ క్రేజ్ ఉన్నా.. కావాలనే అక్కడ ఆ మూవీకి థియేటర్లు కేటాయించకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టే అక్కడ అత్యల్పంగా సలార్‌కు థియేటర్లు దక్కాయి.
ప్రశాంత్ నీల్ దర్శత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన యాక్షన్ మూవీ సలార్.. బాక్సాఫీస్ రికార్డులను కచ్చితంగా బద్దలుకొడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్స్ మొదలైన ప్రతీచోట భారీగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. తొలి రోజు చాలా షోలు ఇప్పటికే హౌస్ ఫుల్ అయ్యాయి.
సలార్ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరిరావు, శ్రీయారెడ్డి కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ మూవీని నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కానుంది.