APPSC Group 2 Registration : 897 గ్రూప్ 2 ఉద్యోగాలు – ఇవాళ్టి నుంచే దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలివే

Best Web Hosting Provider In India 2024

APPSC Group 2 Recruitment 2023 : ఏపీ గ్రూప్ -2 దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ్టి నుంచే ప్రారంభమైంది. 897 పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. 2024 ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనున్నట్లు ఇప్పటికే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఇవాళ్టితో ప్రారంభమయ్యే దరఖాస్తులు… జనవరి 10వ తేదీతో ముగియనున్నాయి.డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు

ఇలా దరఖాస్తు చేసుకోండి..

అభ్యర్థులు మొదటగా https://psc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.

నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును కూడా చెల్లించాలి.

యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ తో లాగిన్ కావాలి.

గ్రూప్ -2 అప్లికేషన్స్ పై క్లిక్ చేసి నిర్ణీత నమూనాలో ఫారమ్ ను పూర్తి చేయాలి.

మొత్తం 3 పేపర్లు… 450 మార్కులు

కొత్తగా ప్రకటించిన సిలబస్ ప్రకారం… 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.ఇందులో కొత్తగా భారతీయ సమాజం అంశాన్ని చేర్చారు ఒక్కో సెక్షన్ కు 30 మార్కులు కేటాయించారు.

మెయిన్స్….

ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ కు అర్హులు అవుతారు.మెయిన్స్‌లో మొత్తం 2 పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 150 మార్కులు కేటాయించారు. పేపర్-1లో చూస్తే ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉన్నాయి. ఇక పేపర్-2లో చూస్తే భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు 75 మార్కులు కేటాయించారు.

 

మెయిన్స్ లోని పేపర్ 1లో చూస్తే… Pre – Historic Cultures, యూరోపియన్ల రాక, ఆంధ్రా ఉద్యమం, ఆంధ్రప్రదేశ్ అవతరణ అంశాలు ఉన్నాయి. ఇక సెక్షన్ బీ లో చూస్తే… భారత రాజ్యంగ స్వభావం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, భారత రాజ్యాంగానికి సవరణలు, కేంద్ర – రాష్ట్ర సంబంధాలు వంటి అంశాలు ఉన్నాయి.

మెయిన్స్ లోని పేపర్ 2లోని సిలబస్ ను చూస్తే… Structure of Indian Economy, Economic Planning and Policy, బ్యాంకింగ్, వ్యవసాయరంగం, ఏపీ ఆర్థిక వ్యవస్థ అంశాలు ఉన్నాయి. సెక్షన్ బీ లో చూస్తే… Technology Missions, Policies and Applications, Energy Management, బయో డైవర్సిటీ, పోల్యూషన్ కంట్రోల్, పర్యావరణం వంటి అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

మరోవైపు కొద్దిరోజుల కిందటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Andhra Pradesh Public Service Commission) – ఏపీపీఎస్సీ పలు ఉద్యోగ నియామకాల్లో కీలక మార్పులు చేసింది. గ్రూప్ – 2 (Group-2)… గ్రూప్ – 3 (Group -2) రిక్రూట్మెంట్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే వారికి కంప్యూటర్ అర్హత తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రూప్ -2, గ్రూప్ – 3 ఉద్యోగ నియామకాల్లో కంప్యూటర్ ప్రొఫిషీయన్సీ సర్టిఫికెట్ ను తప్పనిసరి పొందాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ ప్రకారం… గ్రూప్ – 2, గ్రూప్ -3 నోటిఫికేషన్ల ద్వారా నియమితులయ్యే వారంతా ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యా బోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టు (సీపీటీ) (Computer Proficiency test) పాస్ కావాల్సిందే. 100 మార్కులకి నిర్వహించే ఈ పరీక్షలో అర్హత సాధించేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు… బీసీలు 35.. ఓసీలు 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది.

 
 
WhatsApp channel
 

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *