Nindu Noorella Saavasam December 21st Episode: ఒకే మంచంపై అమర్​, భాగీ.. ఘోరా దగ్గరికి మనోహరి! మంగళ కొత్త ప్లాన్

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam 21st December Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో డోర్​ లాక్​ అవడంతో అమర్, భాగీ ఒకే రూమ్​లో ఇరుక్కుపోతారు. నువ్వు మంచం మీద పడుకో నేను సోఫాలో పడుకుంటాను అని పిల్లో తీసుకొని సోఫాలో పడుకుంటాడు అమర్. ఇదంతా కిటికీలోంచి చూస్తూ ఉంటుంది అరుంధతి. వెనుక నుంచి వచ్చి నీ భర్త మీద నీకు నమ్మకం లేదా అని అడుగుతాడు చిత్రగుప్తుడు.

 

ట్రెండింగ్ వార్తలు

నా భర్త నిజంగానే శ్రీరామచంద్రుడు. కానీ, మిస్సమ్మ ఇబ్బంది పడుతుందేమో అని చూస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది అరుంధతి. ఒక రాత్రికి తను ఈ గదిలో ఉంటే ఇలా అయిపోతున్నావు.. రేపు శాశ్వతంగా తను ఈ గదిలోనే ఉంటుంది. అప్పుడు ఏమైపోతావో ఏమో అని అనుకుంటాడు చిత్రగుప్తుడు. పూజ చేస్తున్న ఘోరాకి ఏకాగ్రత కుదరదు. అప్పుడు స్వామి ప్రత్యక్షమై ఏం జరిగింది అని అడుగుతాడు. నేను ఆత్మని బంధించలేకపోతున్నాను.. ఏదో శక్తి నన్ను అడ్డుకుంటుంది.. ఓడిపోతానేమో అనిపిస్తుంది అంటాడు ఘోరా.

బంధించలేకపోతున్నా

చాలామంది ఆత్మను బంధించే శక్తులు వశం చేసుకోవాలనుకున్నారు. కానీ, మధ్యలోనే ప్రయత్నాన్ని ఆపేశారు. నువ్వు మాత్రం ఈ పని పూర్తి చేస్తావ్ అనుకున్నాను. ఎందుకు అంటే నీకు ఉన్న పట్టుదల అలాంటిది. మరి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అంటాడు స్వామి. ఇప్పటికీ మూడుసార్లు ప్రయత్నించాను. కానీ, ఆత్మని బంధించలేకపోయాను అంటాడు ఘోరా. వెనకడుగు వెయ్యొద్దు నీ కార్యం సిద్ధించే సమయం దగ్గర పడింది. నీకు ఇద్దరు మానవులు సాయం చేస్తారు అంటాడు స్వామి.

ఆనంద పడుతూ ఎవరు ఆ మానవులు. ఆ ఆత్మకి కానివారా.. అని అడుగుతాడు ఘోరా. కాదు అయినవారు అంటాడు స్వామి. అంటే ఆత్మను ఆ ఇంట్లో నుంచి తరిమేయాలని చూస్తున్నారా అని ఆనందంగా నవ్వుకుంటాడు ఘోరా. ఒకే గదిలో పడుకున్న అమర్ మిస్సమ్మ ఇద్దరూ కలిసిపోయినట్లు కలకంటుంది మనోహరి. చెమటలు కక్కుకుంటూ, అలా జరగకూడదు అంటూ నిద్రలేస్తుంది. నిద్రలేచి.. ఏమ్మా వాళ్లిద్దరూ కలిసిపోయినట్లు కలగన్నారా అంటుంది నీల. నీకెలా తెలుసు అంటుంది మనోహరి.

 

సొంత భర్త అయినట్లు

వాళ్లిద్దరూ గదిలో ఉన్నారు కదమ్మా ఇంక మీకు నిద్ర ఏం పడుతుంది అంటుంది నీల. వాళ్లిద్దరూ ఎలా ఉన్నారో చూడడం కోసం రూమ్ వెనుక నుంచి వెళ్లి చూస్తుంది మనోహరి. ఒకరిని బెడ్ మీద ఒకరిని సోఫాలోని చూసి శాంతిస్తుంది. రేపు కీ మేకర్ వస్తే సరే లేదంటే నేనే తలుపులు బద్దలు కొట్టేస్తాను అని కోపంగా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇదేదో ఇప్పుడు సొంత భర్త అయినట్లు ఫీల్ అయిపోతుంది. అనవసరంగా బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది అని మనోహరిని తిట్టుకుంటుంది నీల.

మరుసటి రోజు పొద్దున్నే నిద్ర లేచిన చిత్రగుప్తుడు ఈ బాలిక ఏమి చేస్తుందో అనుకొని అరుంధతిని వెతకడానికి వెళ్తాడు. అమర్ రూమ్ కిటికీ దగ్గరే ఉంటుంది అరుంధతి. చూస్తుంటే రాత్రంతా ఇక్కడే ఉన్నట్టున్నావు. ఎందుకు అంత బాధ అంటాడు చిత్రగుప్తుడు. మరి తాళాలు ఎక్కడ ఉన్నాయో రాథోడ్ కి చెప్పమంటే చెప్పడం లేదు కదా అంటుంది అరుంధతి.

చిత్రగుప్తుడి ఆనందం

నువ్వు అంగుళీకము నాకు ఇచ్చి వేయవచ్చును కదా.. నాకు అంగుళీకం ఇస్తే నిన్ను మా లోకానికి తీసుకు వెళ్లను. నేను మాత్రమే వెళ్తాను. నాకు మా తల్లిని చూడాలనిపిస్తుంది. అలాగే నిండుకుండ రత్తడికి తాళం ఎక్కడ ఉందో కూడా చెప్తాను అంటాడు చిత్రగుప్తుడు. సరే అని అంగుళీకము తీసుకురావడానికి వెళ్తుంది అరుంధతి. తన మాటలు అరుంధతి నమ్మినందుకు ఆనందపడతాడు చిత్రగుప్తుడు. తనకి సపర్యలు చేస్తున్న భార్య బావమరిదిని చూసి ఆశ్చర్యపోతాడు రామ్మూర్తి.

 

ఈరోజు ఏమైంది మీ ఇద్దరికీ, ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతాడు. ఇన్నాళ్లు ఏదో దయ్యం పట్టింది అందుకే అలా ప్రవర్తించాము. కానీ మా కోసం నువ్వు ఇంత కష్టపడుతున్నావు. అందుకే ఇదంతా చేస్తున్నాము అంటుంది మంగళ. నిజంగా మీలో మార్పు వస్తే నాకంటే సంతోషించేవాడు ఎవడు ఉండడు అని అంటాడు రామ్మూర్తి. మంగళ, కాళీ నాటకం వెనక ఉపాయం ఏంటి? అమర్​, భాగీని విడగొట్టడానికి మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే డిసెంబర్​ 22న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *