Best Web Hosting Provider In India 2024

Sreeleela Guntur Kaaram: మహేష్ బాబు గుంటూరు కారం మూవీ కోసం శ్రీలీల తన ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ త్యాగం చేసింది. గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజవుతోంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మాస్ యాక్షన్ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
గుంటూరు కారం మూవీ షూటింగ్ తుది దశకు చేరుకున్నది. మహేష్‌బాబు, శ్రీలీలపై ఓ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు సమాచారం. కానీ ఎంబీబీఎస్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రావడడంతో గుంటూరు కారం షూటింగ్‌కు ఐదు రోజుల పాటు శ్రీలీల బ్రేక్ ఈవ్వబోతున్నట్లు ప్రచారం జరిగింది.
రిలీజ్ డేట్ దగ్గర పడటంతో తన వల్ల షూటింగ్ ఆగిపోకూడదని భావించిన శ్రీలీల ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ త్యాగం చేసినట్లు సమాచారం. మెడిసిన్ ఎగ్జామ్స్ సప్లిమెంటరీలో రాసుకోవాలని ఫిక్సైపోయి తిరిగి గుంటూరు కారం షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలిసింది. గురువారం శ్రీలీల గుంటూరు కారం సాంగ్ షూట్‌లో పాల్గొన్నట్లు చెబుతున్నారు.
శుక్రవారం నుంచి ఈ డ్యూయెట్ సాంగ్ షూట్‌లో మహేష్‌బాబు పాల్గొననున్నట్లు తెలిసింది. మంగళవారం నాటితో ఈ పాట షూట్ పూర్తవుతుందని సమాచారం. ఈ సాంగ్‌తోనే గుంటూరుకారం షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
గుంటూరు కారం సినిమాలో శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. తొలుత పూజాహెగ్డేను మెయిన్ లీడ్‌గా శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా ఈ సినిమాలో ఎంపికైంది. కానీ పూజాహెగ్డే అర్ధాంతరంగా సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీలీలకు మెయిన్ హీరోయిన్‌గా ప్రమోషన్ దక్కింది. గుంటూరు కారం సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తమన్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.