YSRCP Nandigama :








ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.24-9-2022(శనివారం) ..
అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం వై.యస్.జగన్ ప్రభుత్వ లక్ష్యం ..
ఐతవరం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని ఐతవరం గ్రామంలో శనివారం ఉదయం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు , ముందుగా ఉమ్మడి రాష్ట్ర మాజీ హోం శాఖ మాత్యులు వసంత నాగేశ్వరరావు గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు కొద్దిసేపు ముచ్చటించారు , ఈ సందర్భంగా గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా దిగ్విజయంగా 10 వేల గడపలను సందర్శించి , ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చుపుతున్న ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారిని వసంత నాగేశ్వరరావు గారు అభినందించారు ..
అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ,మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ,అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు , ఇచ్చిన హామీలలో 95 శాతం నెరవేర్చి చేతల ప్రభుత్వంగా ముఖ్యమంత్రి ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు , అర్హత ప్రామాణికంగా కుల మత వర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ,ఈ సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయుడు ఉదయలక్ష్మి , ఐలపొగు రమాదేవి, వైస్ ఎంపీపీలు అన్నం పిచ్చయ్య , ఆకుల రంగా, ఎమ్మార్వో నరసింహారావు ,మండల పార్టీ అధ్యక్షులు శివ నాగేశ్వరరావు , సీతారామయ్య , పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు ..
శాసనమండలి ప్యానెల్ వైస్ చైర్మన్ సభ్యుడిగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
Follow Us : Facebook ,Instagram ,Twitter
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka