Best Web Hosting Provider In India 2024

Husnabad Model School: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం మెనులో పొందుపరిచిన విధంగా తప్పకుండా అమలు చెయ్యాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు.
ట్రెండింగ్ వార్తలు
తెలంగాణ మోడల్ స్కూల్ హుస్నాబాద్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే విషయాన్ని గమనించిన కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు, ఈ పాఠశాలలో వంట చేసే ఏజెన్సీ వారితో వాదనకు దిగారు. జరిగిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళగా, గురువారం మాడల్ స్కూల్ సందర్శించి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు.
విద్యార్థులు ఇచ్చిన సమాచారం ప్రకారం, మెను ప్రకారం భోజనం పెట్టలేదనే విషయాన్ని కలెక్టర్ గ్రహించి వంట చేసే ఏజెన్సీ వారిని ప్రశ్నించారు. వారు తాము మార్కెట్లో దొరికిన కురగాయాలను వండుతున్నామని వంటమనిషి భాగ్యలక్ష్మి నిర్లక్షంగా కలెక్టర్ కి సమాధానం చెప్పారు.
వారి ప్రవర్తన పైన ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, మెను ప్రకారం నాణ్యమైన పద్ధతిలో వండాలనుకుంటే మాత్రమే ఏజెన్సీలో చేయాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే ఏజెన్సీని మార్చాలని ప్రిన్సిపాల్ అన్నపూర్ణ కి ఆదేశాలు ఇచ్చారు. ఇలా జరుగుతున్న సంఘటనల గురించి డిఈఓ, ఎంఈవో, ప్రిన్సిపాల్ విచారణ జరపాలని ఆదేశాలు జారీచేశారు. ఎంఈఓ తరచు పర్యవేక్షణ చేసి, ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.
రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటు, ఆర్టీఏ కార్యాలయల భవనాల నిర్మాణాలకు సరిపడే స్థలాన్ని అన్వేషించాలని హుస్నాబాద్ తహసీల్దార్ రవీందర్ రెడ్డిని ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో మంత్రి నివసించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి నివాసం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలన్నారు.