Best Web Hosting Provider In India 2024

Krishna mukunda murari december 22nd: రేవతి వాళ్ళందరూ కృష్ణ ఇంటికి వెళ్లారని చెప్పి వాళ్ళ మీద నెగటివ్ గా భవానీకి చెప్తుంది ముకుంద. వాళ్ళు నావైపు చాలా నీచంగా చూస్తున్నారు. నేనేదో కాని పని చేస్తునట్టు చూస్తున్నారు. తట్టుకోలేకపోతున్నా. ఈ కేసులు అసలు దోషులని పట్టుకోవడం ఇవేవీ నాకు అవసరం లేదత్తయ్య. నాకు కావలసింది మురారితో జీవితం పంచుకోవడమేనని అంటుంది. నాకు ఈ ఒక్కసాయం చేయండి జీవితాంతం మీ కాళ్ళ దగ్గరపడి సేవ చేసుకుంటానని భవానీ కాళ్ళు పట్టుకుంటుంది.
ట్రెండింగ్ వార్తలు
కృష్ణ ఇంటికెళ్ళి రచ్చ చేసిన భవానీ
నేను ఉన్నాను కదా ఎందుకు భయమని భవానీ అంటుంది. మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఉన్నాను లేదంటే ఎప్పుడో చచ్చిపోయే దాన్నని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది. కృష్ణ ఇంట్లో అందరూ టిఫిన్ చేసేందుకు కూర్చుంటాడు. కృష్ణ కోసం మురారి వంట చేస్తాడు. గన్ పట్టుకునే వాడి చేత గరిట పట్టిస్తావా అంటూ అందరూ ఆట పట్టిస్తారు. మురారిని కూడా టిఫిన్ తినడానికి కూర్చోమంటే తర్వాత తింటానని చెప్తాడు. అంతేలే మా తొట్టి గ్యాంగ్ వెళ్లిపోయాక ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటూ టిఫిన్ తింటారా అంటూ మధుకర్ కాసేపు ఆట పట్టిస్తాడు. అందరూ సంతోషంగా నవ్వుకుంటూ ఉండగా భవానీ వచ్చి స్టాపిడ్ అని గట్టిగా అరుస్తుంది.
ఏంటి ఇదంతా రేవతి అని సీరియస్ గా అడుగుతుంది. ఈ నవ్వులు ఏంటి? ఎందుకు ఇంత ఆనందమని అడుగుతుంది. ఏమైందని ఇంతగా రియాక్ట్ అవుతున్నారని రేవతి అంటుంది. మనతో పాటు మన ఇంట్లో తన జీవితం ఏమైపోతుందోనని భయంతో తన ప్రాణాలు కూడా తీసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి ఉందని తెలుస్తుందా మీకు? లేకపోతే మీరందరూ తనని చంపేయాలని అనుకుంటున్నారా? అని నిలదీస్తుంది. ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మురారి అంటాడు. అయినా మనకి ఇల్లు లేనట్టు ఇలా ఇళ్ళలో పడి తినడం ఏంటని భవానీ చీదరింపుగా మాట్లాడుతుంది. కృష్ణ మాట్లాడబోతుంటే నోరు మూయిస్తుంది.
కృష్ణ వాళ్ళే దోషులన్న భవానీ
అసలు దోషులు ఎవరో పట్టుకునే వరకు భార్యాభర్తలుగా ఉండమని చెప్పి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటని ప్రశ్నిస్తుంది. ఒక్కసారి తాను చెప్పేది వినమని అంటుంది. పెద్దమ్మ నేను ఈ కేసు గాలికి వదిలేయడం జరిగితే ముకుందతో నా పెళ్లి కదా. మరి నేను ఈ కేసు వదిలితే రిలాక్స్ గా ఉండాలసింది పోయి ఎందుకు ఇరిటేట్ అవుతున్నారని అడుగుతాడు. నువ్వు అర్థం చేసుకుంది ఇదే మురారి. కానీ ఈ కేసు ఫైనల్ హియరింగ్ వచ్చేసరికి వీళ్ళే నేరం చేశారని తొందరగా అర్థం అయితే అంత మంచిదని నేను తొందరపడుతున్నానని చెప్తుంది.
ముకుంద గురించి ఆలోచించడం లేదని ఎందుకు అనుకుంటున్నారని కృష్ణ అడుగుతుంది. ఆలోచిస్తే ఈ జాతర ఏంటని భవానీ సీరియస్ అవుతుంది. ఏసీపీ సర్ రమ్మన్నా కూడా రాకుండా ఉంది ఎందుకో తెలుసా? నన్ను చూసిన ప్రతిసారి ముకుంద మనసు పాడై మళ్ళీ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని.. లేకపోతే గతం గుర్తుకు వచ్చిన భర్త ఇంట్లో అడుగుపెట్టకపోవడానికి నాకేమైన పిచ్చా అంటుంది. పిచ్చి కాదు భయం.. రేపటి రోజున మీరే దోషులని తెలిస్తే ఏం చేస్తానో అనే భయం అనేసి భవానీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరూ టిఫిన్ తినకుండా మనసు పాడైపోయిందని అంటారు. కానీ కృష్ణ వాళ్ళకి నచ్చజెపుతుంది. రేవతి కోపంగా వాళ్ళని కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేశాకే రమ్మని చెప్పి వెళ్ళిపోతుంది.
భవానీకి ఎదురుతిరిగిన రేవతి
భవానీ ముకుంద మాటల గురించి ఆలోచిస్తుంది. ముకుంద బాధపడటంలో అర్థం ఉంది. ఇంట్లో ఇలా ఉంటే వాళ్ళు అలా ఎంజాయ్ చేయడం ఏంటోనని చీదరించుకుంటుంది. రేవతి ఇంట్లోకి వస్తే ఏంటి అప్పుడే వచ్చావ్ కాసేపు అంత్యక్షరి ఆడుకొని రావొచ్చు కదా అంటుంది. ఆడి వస్తే తప్పేంటక్క అని రేవతి సీరియస్ గా అంటుంది. ఆ పిల్లలతో అలా ఉంటే నష్టం ఏంటని రేవతి ఎదురుతిరుగుతుంది. నష్టం ఏంటో ఇందాక చెప్పాను కదా ముకుంద ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే అని భవానీ అంటుంది.
ముకుంద ముకుంద.. ఏంటక్క ముకుంద. ఇప్పటికే రెండు సార్లు చావు డ్రామా ఆడింది మర్చిపోయావా? అని రేవతి నిలదీస్తుంది. ముకుంద పడే బాధ డ్రామాలా అనిపిస్తుందా?కృష్ణతో ఉండేసరికి నీకు వాళ్ళలాంటి మైండ్ నీకు వచ్చింది. అసలు ఆ పిల్ల ఎంత బాధపడుతుందో తెలుసా?అంటుంది. రేవతి మౌనంగా ఉండేసరికి ఏంటి మాట్లాడవ్ అని అడుగుతుంది. ఏంటి మాట్లాడేది మీరు నాతో మాట్లాడన్నా నేను మీతో మాట్లాడలన్నా ముకుంద మీద జాలి చూపించాలి. అది నాకు ఇష్టం లేదు. నాకు నా బిడ్డ జీవితం ముఖ్యం. వాడు కోరుకున్నది ఇవ్వడం ఇష్టం. ఎవరో కన్నీళ్ళు పెట్టుకుంటున్నారని ఇంకో ఆడపిల్ల జీవితానికి అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదని రేవతి తెగేసి చెప్తుంది.
కృష్ణ నేరం చేసిందని తెలిస్తే విడాకులు ఇప్పిస్తా
ఎవరూ ఆ అమ్మాయి జీవితాన్ని అన్యాయం చేయలేదు. తనే చేసుకుంది. నీ బిడ్డ చనిపోయినట్టు అనాథ శవాన్ని పంపించిన వాళ్ళు నీకు ఇష్టమా. నీ బిడ్డ చనిపోలేదు బతికే ఉన్నాడని తీసుకెళ్ళి చూపించిన వాళ్ళు అంటే నీకు ఇష్టం లేదా లెక్క లేదా? ముకుంద ఆరోజు హాస్పిటల్ లో మురారి ఉన్నాడని చెప్పకపోతే ఇప్పటికీ వాడి కోసం ఏడుస్తూనే ఉండే వాళ్ళం కాదంటావా చెప్పు రేవతి. చెప్తానక్కా మీరు అంతా చెప్పింది ఇప్పటి వరకు జరిగింది మాత్రమే. అది చేసింది ఎవరో తెలియకముందే ఒక నిర్ధారణకి రావడం తప్పని చెప్తుంది. ఇప్పటికీ ఇది చేసింది వాళ్ళు కాదని నమ్ముతున్నావా అంటుంది.
నిజంగా కృష్ణ వాళ్ళే చేశారని తెలిస్తే విడాకుల పేపర్స్ మీద సైన్ పెట్టించి నేనే మెడ పట్టుకుని బయటకి గెంటేస్తానని అంటుంది. అయితే నువ్వు ఇదే మాట మీద ఉంటావా అడుగుతుంది. ఉంటాను మీరు కూడా దీని వెనుక కృష్ణ లేదని తెలిస్తే వాళ్ళ బంధం శాశ్వతం చేస్తారా? అని భవానీని ప్రశ్నిస్తుంది. చూస్తాను అంటే చూస్తారా చేస్తారా? అంటుంది. నేను ఏదీ ఇప్పుడే మాట ఇవ్వను. ఒకసారి ఇస్తే దాన్ని నెరవేర్చడానికి తొందరపడతానని చెప్పి వెళ్లబోతుంటే రేవతి ఆపుతుంది. మన మురారికి గతం గుర్తుకు వచ్చిందన్న సంతోషం కంటే ముకుందతో పెళ్లి జరుగుతుందా? లేదా అనే విచారమే ఎక్కువగా కనిపిస్తుందని అంటుంది. నేను అనుకునేది ఒక్కటే ముకుంద జీవితం పాడైపోకూడదని భవానీ ముకుంద పాటే పాడుతుంది.
మురారి ఇంటికొచ్చిన దేవ్
శకుంతల కృష్ణ జీవితం ఏమైపోతుందోనని బాధపడుతుంటే మధుకర్ వాళ్ళు సర్ది చెప్తాడు. రేవతి భవానీకి ఎదురుచెప్పినందుకు ఒక పక్క బాధపడుతూనే మళ్ళీ కరెక్ట్ చేశానని అనుకుంటుంది. అందరూ ఇదే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ముకుంద వస్తుంది. దీంతో మాట్లాడుకునే వాళ్ళు మౌనంగా ఉంటారు. ఏంటి నేను రాగానే మాట్లాడుకోవడం ఆపేశారని వాళ్ళ మీద అరుస్తుంది. అప్పుడే దేవ్ ఇంటికి వస్తాడు. తనని చూసి ముకుంద షాక్ అవుతుంది. వీడు ఏంటి నిజంగానే వచ్చేశాడని కంగారుపడుతుంది. రేవతి ఎవరు మీరని అడుగుతుంది. దేవ్ ని ముకుంద పరిచయం చేస్తుంది.