YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ (ఐతవరం) :
ది.27-9-2022(మంగళవారం) ..
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితికి స్వస్తి పలికి – అర్హులను గుర్తించి నేరుగా వారి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ..
ఐతవరం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని ఐతవరం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మంగళవారం రాత్రి ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రతి కుటుంబానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని , ఏ ఇంటికి వెళ్ళినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు- ప్రభుత్వ పని తీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు , అదేవిధంగా గ్రామాలలో ప్రధానంగా తాగునీరు -డ్రైన్ లు- సిమెంట్ రోడ్ల తో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్నారు , గ్రామంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించేందుకు ప్రజల వద్దకే తమ ప్రభుత్వం వస్తుందని చెప్పారు , గత మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు ఓర్వలేక నిత్యం ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయుడు ఉదయలక్ష్మి, వైస్ ఎంపీపీ అన్నం పిచ్చయ్య, మండల కన్వీనర్ శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : అక్క, చెల్లెమ్మల జీవితాల్లో వైయస్సార్ చేయూత ..
Follow us : Facebook ,Twitter ,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka