YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.29-9-2022(గురువారం) ..
ప్రజాసమస్యల పరిష్కారానికి గడపగడపకు- మన ప్రభుత్వం ..
నందిగామ పట్టణంలోని 5 వ వార్డు లో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని ఐదవ వార్డు పరిధిలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ – ప్రభుత్వ పనితీరును వివరించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు- అధికారులు సంయుక్తంగా ప్రజల ముంగిటకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ,పరిష్కరించడమే ద్యేయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు ,ప్రజల పట్ల బాధ్యతతో -జవాబుదారీతనంతో పనిచేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు ,గత ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో తప్ప సాధారణంగా ప్రజల వైపు చూసే వారు కాదని , కానీ నేడు గత ప్రభుత్వాల పరిపాలనకు భిన్నంగా ప్రభుత్వమే ప్రజల ఇంటి ముందుకు వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడేలా చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదన్నారు ,ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే వారికి తప్పకుండా ప్రజాదరణ ఉంటుందని – ప్రజల కోసం పరితపించి పనిచేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్, కమిషనర్ ,ఏఈ , కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు , సచివాలయ సిబ్బంది -వాలంటీర్లు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : పరిమి సుధాకర్ రావు గారి కుమార్తె వివాహ వేడుకలో…
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka