YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు :
ది.29-9-2022(గురువారం) ..
మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి ..
వీరులపాడులో వైయస్సార్ చేయూత వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
వీరులపాడు మండల పరిధిలో 2840 మంది అక్కచెల్లెమ్మలకు చేయూత ద్వారా 5 కోట్ల 32 లక్షలు బ్యాంకు ఖాతాల్లో జమ ..
వీరులపాడు గ్రామంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ చేయూత వారోత్సవాల కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పాల్గొని లబ్ధిదారులైన మహిళలకు చేయూత చెక్కును అందించారు , అనంతరం మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని , మహిళలు అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని – మహిళలే ప్రతి కుటుంబానికి మూల స్తంభాలని ,అటువంటి మహిళల జీవితాలలో వెలుగులు నింపేందుకు వైయస్సార్ చేయూత పథకం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నారని తెలిపారు , గత ప్రభుత్వం మాదిరిగా ఎన్నికలకు రెండు నెలల ముందు పసుపు కుంకుమ పేరుతో మభ్య పెట్టకుండా ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే చేయూత పథకాన్ని అమలు చేసిన ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డికే దక్కిందన్నారు , ప్రజల ఆశలు -ఆకాంక్షల మేరకు పనిచేసే ముఖ్యమంత్రి దొరకడం రాష్ట్ర ప్రజల అదృష్టమన్నారు ,గత ప్రభుత్వం మహిళలను విస్మరించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం మహిళలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోటేరు లక్ష్మి ,జడ్పిటిసి కీర్తి సౌజన్య, మండల పార్టీ అధ్యక్షులు ఆవుల రమేష్ బాబు, ముత్తారెడ్డి , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం ,పలు గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు ,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు ..