
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.29-9-2022(గురువారం) ..
నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు ..
పల్లగిరి గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని పల్లగిరి గ్రామంలో గురువారం సాయంత్రం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారని ,లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ అభివృద్ధి -సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన చేస్తూ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా స్థానం సంపాదించారని తెలిపారు , గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజాప్రతినిధులను -అధికారులను ఏకం చేసి ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే విధంగా గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు , అధికారులంతా గ్రామాల్లోకి వచ్చి ప్రజల ఇళ్ళ ముందు నుంచుని పరిపాలన చేస్తున్న విధానానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయన్నారు , అనంతరం సచివాలయ సిబ్బంది -వాలంటీర్ల పనితీరుపై గ్రామస్తులను ఆరా తీశారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవి కిరణ్ రెడ్డి ,జడ్పిటిసి గాదెల బాబు ,ఎంపిటిసి వేల్పుల రాము ,బుచ్చిరెడ్డి ,అల్లీషా ,మండల పార్టీ అధ్యక్షులు శివ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ..