Best Web Hosting Provider In India 2024

Upasana Namrata Christmas Celebrations: ఈ ఏడాది క్రిస్మస్ పండగను టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ కుటుంబాలు కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు బయటకు రాగా.. తాజాగా మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మరికొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఫొటోల్లో నమ్రతా.. రామ్ చరణ్ భార్య ఉపాసన, డైరెక్టర్ నగేష్ కుకునూర్ లతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది. ఆ తర్వాత తన కొడుకు, కూతురు గౌతమ్, సితారలతోనూ నమ్రత క్రిస్మస్ జరుపుకుంది. నమ్రత ఇన్‌స్టా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. నమ్రత ఫ్రెండ్ సబీనా జేవియర్.. సెలబ్రిటీలకు ఈ క్రిస్మస్ పార్టీ ఇచ్చింది.
ఈ పార్టీలో వీళ్లంతా రెడ్ డ్రెస్ లో మెరిసిపోయారు. అటు మహేష్ బాబు కూతురు సితార కూడా తన క్రిస్మస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కొన్ని రోజుల కింద నమ్రత, సితార కలిసి తమ ఫ్రెండ్ ఇంట్లో క్రిస్మస్ కోసం కుకీలు తయారు చేసే సెషన్ లోనూ పార్టిసిపేట్ చేశారు. ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
సోమవారం (డిసెంబర్ 25) ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండగను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక అంతకుముందు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యామిలీలు కలిసి క్రిస్మస్ జరుపుకున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.