YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.30-9-2022(శుక్రవారం) ..
అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం వై.యస్.జగన్ ప్రభుత్వ లక్ష్యం ..
పట్టణంలోని 5 వ వార్డులో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం” నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 5 వ వార్డులో శుక్రవారం ఉదయం “గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ,మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ,అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు , ఇచ్చిన హామీలలో 95 శాతం నెరవేర్చి చేతల ప్రభుత్వంగా ముఖ్యమంత్రి ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు , అర్హత ప్రామాణికంగా కుల మత వర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ,ఈ సంక్షేమ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ ,ఏఈ , కౌన్సిల్ మరియు కో ఆప్షన్ సభ్యులు ,వార్డ్ ఇన్చార్జిలు ,పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , వాలంటీర్లు పాల్గొన్నారు ..