
Best Web Hosting Provider In India 2024

Devara OTT Rights: జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ ఓటీటీ పార్ట్‌నర్ ఎవరో రివీల్ చేశాడు ఈ మూవీ ప్రొడ్యూసర్, తారక్ అన్న నందమూరి కల్యాణ్ రామ్. తాను నటించిన డెవిల్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అతడు దీనిపై స్పందించాడు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తమ మూవీ హక్కులు సొంతం చేసుకున్నట్లు వెల్లడించాడు.
ట్రెండింగ్ వార్తలు
వచ్చే శుక్రవారం (డిసెంబర్ 29) కల్యాణ్ రామ్ నటించిన డెవిల్ మూవీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్లలోనే అతడు బిజీగా ఉన్నాడు. అయితే ఇందులోనూ తరచూ దేవర మూవీపైనా అప్‌డేట్స్ ఇస్తున్నాడు. దేవర మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు కూడా కల్యాణ్ రామ్ వెల్లడించాడు. త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు.
వీఎఫ్ఎక్స్ పనులు కూడా పూర్తయినట్లు తెలిపాడు. దేవర డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ సీఈవో హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనతో జరిపిన చర్చల గురించి కూడా కల్యాణ్ వెల్లడించాడు. “టెడ్ సరండోస్ తో కలిసినప్పుడు ఆయనతో నెట్‌ఫ్లిక్స్ ఎలా మొదలైంది.. ఎలా ప్రపంచవ్యాప్తంగా వృద్ధి చెందుతుందీ మాట్లాడుకున్నాం. చాలా బాగా అనిపించింది” అని కల్యాణ్ రామ్ అన్నాడు.
కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగంలోనే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, ఔట్‌పుట్ చాలా బాగా వచ్చిందని కల్యాణ్ తెలిపాడు.
దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో భైరా అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
టాపిక్