Best Web Hosting Provider In India 2024

Kota Bommali OTT Release Date: శ్రీకాంత్ ప్రధాన పాత్రలోనటించిన కొటబొమ్మాళి పీఎస్ మూవీ థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. 2023లో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్‌గా విమర్శకుల ప్రశంసలను అందుకున్న కోట బొమ్మాళి పీఎస్ ఓటీటీలోకి రాబోతోంది. న్యూ ఇయర్ వీకెండ్‌లో ఆహా ఓటీటీలో కోట బొమ్మాళి మూవీ స్ట్రీమింగ్ కానుంది. జనవరి 5న శ్రీకాంత్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు చెబుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ న్యూ ఇయర్ రోజున రాబోతున్నట్లు సమాచారం. మలయాళంలో విజయవంతమైన నాయట్టు రీమేక్‌గా కోట బొమ్మాళి పీఎస్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీకాంత్‌తో పాటు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. కోట బొమ్మాళి పీఎస్ మూవీకి తేజా మార్ని దర్శకత్వం వహించాడు.
రాజకీయ నాయకుల ఒత్తిడుల కారణంగా చేయని తప్పుకు ఓ ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ ఎలాంటి శిక్షను అనుభవించారు? చట్టాన్ని రక్షించాల్సిన వాళ్లే ఆ చట్టం చేతిలో ఎలా బలైపోయారు? పోలీసులకు దొరక్కుండా ఎందుకు పారిపోవాల్సివచ్చిందన్నదే కోట బొమ్మాళి మూవీ కథ. ఈ సినిమాలో రామకృష్ణ అనే కానిస్టేబుల్ పాత్రలో శ్రీకాంత్ తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించాడు.