Best Web Hosting Provider In India 2024

Kalyan Ram on Devera: దేవర సినిమా షూటింగ్, బడ్జెట్‌పై డెవిల్ ప్రమోషన్స్‌లో హీరో కళ్యాణ్ రామ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దేవర మూవీ రూపొందుతోంది. సుధాకర్ మిక్కిలినేని, హరి కొసరాజులతో కలిసి హీరో కళ్యాణ్ రామ్ దేవర మూవీని నిర్మిస్తున్నారు. డెవిల్ ప్రమోషన్స్‌లో భాగంగా దేవర బడ్జెట్ గురించి కళ్యాణ్ రామ్ ఇంటెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
దేవర షూటింగ్ 80 శాతం పూర్తయినట్లు చెప్పాడు. టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడని విజువల్ వండర్‌గా దేవర మూవీ ఉండబోతున్నట్లు కళ్యాణ్ రామ్ అన్నాడు. దేవర కథ, సెట్స్, క్యారెక్టరైజేషన్ విషయంలో చాలా రీసెర్చ్ చేశామని, సినిమా రియలిస్టిక్‌గా ఉంటుందని తెలిపాడు.
అందుకే సినిమా సెట్స్‌పైకి రావడానికి టైమ్ పట్టిందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నాడు. హాలీవుడ్ టెక్నిషియన్స్, ఫైట్ మాస్టర్స్ దేవర కోసం పనిచేస్తున్నారని కళ్యాణ్ రామ్ కామెంట్స్ చేశాడు. దేవర విషయంలో ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు తనపై చాలా ప్రెషర్ ఉందని కళ్యాణ్ రామ్ తెలిపాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా కష్టపడుతున్నాడని అన్నాడు.
దేవర అప్‌డేట్స్…
దేవర అప్‌డేట్స్ విషయంలో అభిమానులు చాలా సార్లు డిజపాయింట్ అయ్యారని కళ్యాణ్ రామ్ అన్నాడు. కంటెంట్ విషయంలో హ్యాపీగా, కాన్ఫిడెంట్‌గా ఉన్న తర్వాతే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రకటించడానికే నేను, ఎన్టీఆర్ ఇష్టపడుతుంంటాం. అప్‌డేట్స్ ప్రెషర్ తీసేస్తే హ్యాపీగా పనిచేసుకోవచ్చని నమ్ముతాం అని కళ్యాణ్ రామ్ చెప్పాడు.
కంటెంట్ మొత్తం సిద్ధమైన తర్వాతే సినిమా టీజర్, గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేస్తామని అన్నాడు. దేవరను పాన్ ఇండియన్ లెవెల్‌లో అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. దేవర బడ్జెట్ 300 కోట్లు అని జరుగుతోన్న ప్రచారంపై కూడా కళ్యాణ్ రామ్ రియాక్ట్ అయ్యాడు.
అనుకున్న బడ్జెట్‌లోనే దేవర సినిమా చేస్తున్నామని చెప్పాడు. అంతేకానీ బడ్జెట్ మాత్రం రివీల్ చేయనని తెలిపాడు. దేవర సినిమాతో జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.