Best Web Hosting Provider In India 2024

Parasite Actor Lee Sun Kyun: పారాసైట్ మూవీ ఫేమ్, కొరియన్ నటుడు లీ సన్ క్యున్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రల్ సీయోల్‌లోని ఓ పార్క్‌లో నిలిపి ఉన్న కారులో లీ సన్ క్యున్ డెడ్‌బాడీని బుధవారం ఉదయం పోలీసులు కనుగొన్నారు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించినట్లు కొరియన్ మీడియా సంస్థలు చెబుతోన్నాయి.
ట్రెండింగ్ వార్తలు
డ్రగ్స్ వినియోగం కేసులో లీ సన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గంజాయితో పాటు ఇతర మత్తుపదార్థాలను లీసన్ క్యున్ వినియోగించాడని ఈ ఏడాది ఆరంభంలో అతడిపై కేసు నమోదైంది. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే మూడు సార్లు లీ సన్ క్యున్ పోలీసుల విచారణకు హాజరైనట్లు తెలిసింది. డ్రగ్స్ కేసు కారణంగా సినిమా అవకాశాలను కోల్పోవడమే కాకుండా మానసికంగా లీ సన్ కృంగిపోయినట్లు చెబుతోన్నారు. ఈ కేసుకు సంబంధించి తీర్పు రాకుండానే లీసన్ కన్నుమూయడం చర్చనీయాంశంగా మారింది.
ఈ డ్రగ్స్ కేసులో తాను నిరాపరాధినని, కావాలనే తనను కొందరు డ్రగ్స్ కేసులో ఇరికించారంటూ లీ సన్ క్యూన్ పలుమార్లు మీడియా ముందు వెల్లడించాడు. డ్రగ్స్ వినియోగంపై లీ సన్ క్యున్‌కు పోలీసులు నిర్వహించిన పరీక్షలు అతడికి నెగెటివ్ రిజల్ట్ వచ్చినట్లు సమాచారం. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు లెటర్ రాసి అతడు అదృశ్యమైనట్లు సమాచారం.
చివరకు విషాదాంతంగా లీ సన్ క్యున్ జీవితం ముగిసింది. పారాసైట్‌తో హెల్ప్‌లెస్, ఆల్ ఎబౌట్ మై వైఫ్, ఏ హార్డ్ డే వంటి కొరియన్ సినిమాలు యాక్టర్‌గా లీ సన్ క్యున్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
టాపిక్