Best Web Hosting Provider In India 2024

Salaar Vinaraa Song lyrics: గత వారం రిలీజై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తున్న సలార్ మూవీ నుంచి మంగళవారం (డిసెంబర్ 26) వినరా అనే ఓ మెలోడియస్ సాంగ్ రిలీజైంది. స్నేహ బంధంలోని గొప్పదనాన్ని చాటుతూ సాగే ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మరోసారి వీనుల విందైన మ్యూజిక్ తో అలరించాడు.
ట్రెండింగ్ వార్తలు
ఈ పాటను తెలుగులో కృష్ణకాంత్ రాశాడు. ఇక సచిన్ బస్రూర్ పాట పాడాడు. ఇప్పటికే సలార్ మూవీ నుంచి సూరీడే, ప్రతి గాధలో అంటూ రెండు సింగిల్స్ రిలీజ్ కాగా.. తాజాగా వినరా అంటూ ఈ మూడో పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్ లో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల మధ్య స్నేహాన్ని చాటుతూ సాగే పాట ఇది. ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూడండి.
వినరా పాట లిరిక్స్ ఇవే
వినరా….
వినరా ఈ పగలు వైరం
మధ్యన త్యాగంరా
వినరా ఆ పగలు వైరం
మధ్యన స్నేహంరా
వినరా రగిలే మంటల మధ్యల మంచేరా
వినరా మరిగే గరళం మధ్యన జీవంరా
క్రోధాలే నిండిన లోకంరా
స్వార్ధాలే అంటని బంధంరా
మాట ఇచ్చాడో తానె అవుతాడురా ఎరా
కోపగించాడో తానె అవుతాడురా సొరా
మోసాలే నిండిన లోకంరా
వేలంటూ మరవని బంధంరా
దూసుకొచ్చాడో తానె అవుతాడురా చెరా
తాను నమ్మాడో విననే వినదంటరా మొరా
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన ఈ సలార్ మూవీ డిసెంబర్ 22న రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ తొలి ఐదు రోజుల్లోనే ఇండియాలో రూ.280 కోట్లకుపైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. షారుక్ ఖాన్ డంకీని మించి రెట్టింపు వసూళ్లు సాధించడం విశేషం.