Best Web Hosting Provider In India 2024

Brahmamudi Today Episode: మాక్‌టెయిల్ అనుకొని మందుతాగుతారు రాజ్, విక్రమాదిత్య. తమతో పాటు రూమ్‌కు తెచ్చుకున్న మందును కావ్య, పద్మావతి కూడా తాగేస్తారు. తాగిన మత్తులో రాజ్‌ను తాను ఎంతగా ప్రేమిస్తున్నది చెప్పేస్తుంది కావ్య. తర్వాత రోజు ఉదయం లేవగానే కావ్య తన గుండెలపై పడుకోవడం చూసి రాజ్ కంగారు పడతాడు. ఏమైంది, నువ్వు నా గుండెలపై ఎందుకు పడుకున్నావని అంటాడు. రాత్రి మీలోని రొమాంటిక్ ఫెల్లో బయటకు వచ్చాడని కావ్య సిగ్గుపడుతూ సమాధానం చెబుతుంది.
ట్రెండింగ్ వార్తలు
రాత్రి జరగాల్సిందే జరిగింది అంటూ నేను చెప్పను, సిగ్గేస్తుంది అంటూ రాజ్‌ను ఆటపట్టిస్తుంది. చేయాల్సింది అంతా చేసి ఏం తెలియని చంటి పిల్లాడిలా యాక్ట్ చేస్తున్నారంటూ అసలు నిజం చెప్పకుండా రాజ్‌ను ఏడిపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పమని కావ్యను బతిమిలాడుతాడు రాజ్.
మూడు నెలలు ఆగితే తాను నెల తప్పుతానని.. అప్పుడు ఏం జరిగిందనేదానిపై క్లారిటీ వస్తుందని చెప్పి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కావ్య వెళ్లిపోగానే కర్మ అంటూ తలపట్టుకొని అక్కడే కూలబడిపోతాడు.
స్వప్న ఫైర్…
అరుణ్‌ను కావ్య, స్వప్న కలిసి ఓ రూమ్‌లో బంధిస్తారు. ఆకలితో అతడు బాధపడుతున్నాడని తెలిసి ఇడ్లీ తీసుకొస్తుంది కనకం. శత్రువునైనా నా ప్రాణం గురించి కూడా మీరు పట్టించుకున్నారంటే గ్రేట్ అని అరుణ్ అంటాడు. సింపథీతో అరుణ్‌ను బోల్తా కొట్టించి అతడి ద్వారా నిజాలు మొత్తం బయటపెట్టించాలని కనకం అనుకుంటుంది.
కానీ ఇలాంటి డ్రామాలకు తాను కరిగిపోయి నిజాలు చెప్పనని అరుణ్ అంటాడు. తన మనసు మారదని చెబుతుంది. ఫ్రెండ్‌షిప్ పేరుతో నన్ను స్వప్న బకారాను చేసిందని కోప్పడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న…అరుణ్ మాటలతో ఫైర్ అవుతుంది. అతడిని చెంపపై గట్టిగా ఒకటి కొడుతుంది.
అరుణ్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుంది. కానీ కనకం అడ్డుకుంటుంది. నీపై పడిన నిందలు తొలగిపోవాలంటే అరుణ్ బతికి ఉండాలని కూతురికి సర్ధిచెబుతుంది. పెళ్లి తర్వాత అరుణ్‌ను దుగ్గిరాల ఫ్యామిలీకి అప్పగిద్దామని అంటుంది.
రుద్రాణి సెటైర్…
దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికి మట్టిగాజులు తెప్పిస్తుంది ఇందిరాదేవి. మట్టి గాజులు వేసుకోవడానికి అందరూ నిరాకరిస్తారు. మట్టి గాజులు బంధాలను గుర్తుకుతెస్తాయని ఇందిరాదేవి వాటి ఔన్నత్యం వివరిస్తుంది. గాజుల సంప్రదాయం నా పెళ్లిలో ఎందుకు చేయలేదని స్వప్న అంటుంది. కళ్యాణ్, అనామిక పెళ్లిలా నీది పద్దతిగా జరగలేదని కోడలిపై సెటైర్స్ వేస్తుంది రుద్రాణి.
అనామిక ప్లాన్…
కళ్యాణ్‌ను రెండు కోట్లు అడగమని ఆమె తల్లిదండ్రులు చెబుతారు. కానీ అతడిని డబ్బు అడగటానికి అనామిక సంశయిస్తుంది. డబ్బు కోసమే తనను ప్రేమించానని అతడు ఎక్కడ అపార్థం చేసుకుంటాడోనని టెన్షన్ పడుతుంది. కానీ తల్లిదండ్రులు ఆమెను బలవంతపెట్టి డబ్బులు అడగమని కళ్యాణ్ రూమ్‌కు పంపిస్తారు.
కళ్యాణ్‌ను అనామిక డబ్బు అడగబోతుండగా ప్రకాషం వచ్చి డిస్ట్రబ్ చేస్తాడు. కళ్యాణ్‌ను రూమ్ నుంచి బయటకు తీసుకెళతాడు. డబ్బు ఇచ్చిన మార్వాడీ కూతురి పెళ్లి ఎక్కడ ఆపేస్తాడోనని అనామిక తండ్రి టెన్షన్ పడుతుంటాడు. మంచి టైమ్ చూసుకొని తానే కళ్యాణ్‌ను ఆ డబ్బు అడుగుతానని తండ్రికి సర్ధిచెబుతుంది అనామిక.
కనకం సర్‌ప్రైజ్…
డబ్బుల కోసం మార్వాడీ రిసార్ట్‌కు వస్తాడు. అతడిని అనామిక తండ్రి సుబ్రహ్మణ్యం గదికి కనకం తీసుకొస్తుంది. మీకో సర్‌ప్రైజ్ అంటూ మార్వాడీని చూపిస్తుంది. అతడిని చూసి అనామిక తల్లిదండ్రులు షాకవుతారు. డబ్బులు ఇచ్చే వరకు పెళ్లి వేడుకలో మీతో పాటే ఉంటానని మార్వాడీ అంటారు. తప్పించుకోవడానికి మరోదారి లేక మార్వీడీ ప్రపోజల్‌కు ఒప్పుకుంటారు అనామిక తల్లిదండ్రులు.
రాహుల్ ఆశీర్వాదం…
అనామిక చేతులకు గాజులు తొడిగి ఆమెను ఆశీర్వదించే బాధ్యతను అన్నగా రాహుల్‌కు అప్పగిస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ. ఈ వేడుక చూసి కనకం ఎమోషనల్ అవుతుంది. తనకు అన్నదమ్ములు ఉంటే బాగుండునని అనిపిస్తుందని అంటుంది. మేము ఉన్నానని సుభాష్ అంటాడు.
సుభాష్, ప్రకాషం కలిసి ఆమె చేతికి గాజులు తొడుగుతారు. ఆ సీన్ చూసి అపర్ణ సహించలేకపోతుంది. ఇవి నాకు బంగారు గాజులతో సమానం అంటూ కనకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసి రుద్రాణి సెటైర్ వేస్తుంది. సొంతం చెల్లెని పక్కనపెట్టి పరాయి వాళ్లకు గాజులు తొడుగుతున్నారంటూ ఫైర్ అవుతుంది. సుభాష్ సారీ చెబుతాడు. అయినా రుద్రాణి పట్టించుకోదు.
అప్పు షాక్…
పెళ్లి వేడుకలో జంటలందరూ డ్యాన్సులతో ఇరగదీస్తారు. కళ్యాణ్, అనామిక డ్యాన్స్ చేస్తుంటే అప్పు ఆపుతుంది. కళ్యాణ్‌ను కౌగిలించుకుంటుంది. అది చూసి దుగ్గిరాల ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు అనామిక కూడా షాకవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.